భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఎన్నోసార్లు వరల్డ్ కప్ కు చేరువగా వెళ్లి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయిన టీమ్ ఇండియా ఈసారి మాత్రం వరల్డ్ కప్ టైటిల్ ను ముద్దాడ గలిగింది. వెస్టిండీస్ యుఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఒక్క ఓటమి కూడా లేకుండా ఏకంగా వరల్డ్ కప్  టైటిల్ గెలుచుకున్న మొదటి జట్టుగా చరిత్ర సృష్టించింది టీమిండియా.


 ఇక భారత జట్టు సాధించిన ఈ అఖండ విజయంపై 140 కోట్ల మంది భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవల స్వదేశానికి వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా ఎంట్రీ ఇచ్చింది. దీంతో వారికి ఘనస్వాగతం లభించింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఇలా వరల్డ్ కప్ సాధించిన టీమిండియా ఆటగాళ్లు అందరితో కూడా ముంబైలో విక్టరీ పరేడ్ నిర్వహించి ఒక భారీ రోడ్ షో నిర్వహించగా.. అభిమానులు భారీగానే తరలివచ్చారు. దీంతో ఇక ఈ రోడ్ షో అభిమానులు అందరితో కూడా కిక్కిరిసిపోయింది అని చెప్పాలి  అదే సమయంలో ముంబై లోని వాంకడే స్టేడియంలో ఒక ప్రత్యేకమైన ఈవెంట్ ఏర్పాటు చేశారు.


 ఇక ఈవెంట్లో మాట్లాడిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ ట్రోఫీ గెలిచిన తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర బాబోద్వేగానికి గురయ్యాడు అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు  మేమిద్దరం దాదాపు 15 సంవత్సరాలుగా టీమిండియా తరఫున కలిసి ఆడుతున్నాము. అయితే ప్రపంచ కప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనేదే మా కల. ఇక వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ చాలా భావోద్వేగానికి గురయ్యాడు. అతన్ని అలా చూడటం మొదటిసారి. ఇక ఇద్దరం కూడా ఒకరిని ఒకరం ఆలింగణం చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నాం అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇలా వరల్డ్ కప్ గెలిచిన రోజునే నేను నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోను అంటూ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: