దాదాపు 13 ఏళ్ల నిరీక్షణకు తెర దింపుతూ.. రోహిత్ సేన ఇటీవలే వరల్డ్ కప్ టైటిల్ ని ముద్దాడింది అన్న విషయం తెలిసిందే. అద్భుతమైన ఆట తీరును కనబరిస్తూ ఒక్క ఓటమి లేకుండానే ఏకంగా వరల్డ్ కప్ టైటిల్ గెలుచుకోగలిగింది. దీంతో భారత జట్టు ప్రదర్శన పై ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇటీవల వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా స్వదేశానికి చేరుకోగా.  భారత ఆటగాళ్లు అందరికీ కూడా ఘన స్వాగతం లభించింది అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే ఇలా టీమిండియా ఫ్యాన్స్ అందరి దశాబ్ద కాలం నాటి కలను నెరవేర్చిన రోహిత్ సేనకు అభిమానులు అడుగడుగునా నీరాజనం పలికారు. అయితే టి20 వరల్డ్ కప్ సాధించిన నేపథ్యంలో ఇక ముంబై రోడ్లపై అటు టీమిండియా ఆటగాళ్లు నిర్వహించిన రోడ్ షో ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వేలాదిగా తరలివచ్చిన అభిమానుల మధ్య వరల్డ్ కప్ ట్రోఫీతో రాలీగా వచ్చిన టీమిండియా ఆటగాళ్లు వాంకడే  స్టేడియం కు సక్సెస్ఫుల్గా చేరుకున్నారు. అయితే భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించింది ఎవరు  అనే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా భూమిరా రోహిత్ హార్దిక్ లాంటి కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.


 అయితే ఇదే విషయం గురించి స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ విశ్వవిజేతగా నిలవడానికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన బుమ్రా కాదు మరొకరు కారణం అంటూ చెప్పుకొచ్చాడు. ఏకంగా కెప్టెన్ రోహిత్ శర్మని వరల్డ్ కప్ గెలవడానికి కారణం అంటూ తెలిపారు. కాగా భారత బౌలర్ బుమ్రా అతి తక్కువ ఎకానమీతో 15 వికెట్లు పడగొట్టడంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును దక్కించుకున్నాడు. అయినప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ టీమిండియా  వరల్డ్ కప్ గెలవడానికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు  రోహిత్ కెప్టెన్ గా మాత్రమే కాకుండా వ్యక్తిగత ఆట తీరుతో కూడా జట్టును విజయతీరాలకు నడిపించాడు అంటూ గవాస్కర్ అన్నాడు. అందుకే రోహిత్ కి అత్యుత్తమ ప్రశంసలు దక్కాలి. టోర్నమెంట్లో భారత జట్టులో అతని కెప్టెన్సీనే నాకు అత్యుత్తమ ప్రదర్శన అంటూ గవాస్కర్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: