టీమిండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటూ అదరగొడుతున్నారు. ఈ క్రమంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే  అయితే ఇలా దేశవాళి టోర్నీలలో మంచి ప్రదర్శన చేస్తున్న యువ ఆటగాళ్లు ఇక టీమిండియాలో కూడా ఛాన్సులు దక్కించుకుంటున్నారు. ఇక అంతర్జాతీయ క్రికెట్లో తమ దేశం తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు  వచ్చిన అవకాశం కూడా ఎంతో బాగా సద్వినియోగం చేసుకుంటున్నారు.


 ఈ క్రమంలోనే భారత జట్టు తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇక తామే టీమ్ ఇండియాకు భవిష్యత్తు స్టార్స్ అన్న విషయాన్నినిరూపించుకుంటున్నారు అని చెప్పాలి.ఈ క్రమంలోనే ప్రస్తుతం భారత జట్టు జింబాబ్వే పర్యటనలో ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ పర్యటనలో భాగంగా ఎంతో మంది యువ ఆటగాళ్లకు బీసీసీఐ సేలెక్టర్లు అవకాశం కల్పించారు. మొన్నటి వరకు ఐపీఎల్ లో అదరగొట్టిన ప్లేయర్స్ ఇప్పుడు టీమిండియా తరఫున కూడా సూపర్ పర్ఫామెన్స్ చేసేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల జింబాబ్వే తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా అభిషేక్ శర్మ మెరుపు సెంచరీ తో చెలరేగిపోయాడు.


 46 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు భారత క్రికెట్లో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాళ్లు ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారింది. ఈ లిస్టులో కెప్టెన్ రోహిత్ శర్మ టాప్ లో ఉన్నాడు. 2017 లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ 35 బంతుల్లో సెంచరీ చేశాడు. 2023లో శ్రీలంకతో మ్యాచ్లో సూర్యకుమార్ 45 బంతుల్లో, 2016 వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో కేఎల్ రాహుల్, 2024 జింబాబ్వేతో మ్యాచ్లో 46 బంతుల్లో అభిషేక్ శర్మ, 2022 ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్లో 48 బంతుల్లో సూర్య కుమార్ యాదవ్ ఫాస్టెస్ట్ సెంచరీలు చేసిన ప్లేయర్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: