ఇండియాలో క్రికెటర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా క్రికెటర్లను ఆరాధ్య దైవంగా ఆరాధిస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే తమ అభిమాన క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెరమీదికి వచ్చిన కూడా అది సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా క్రికెటర్లకు సంబంధించిన ప్రేమ పెళ్లి వ్యవహారాలు అయితే ఇక అందరూ దృష్టిని తెగ ఆకట్టుకుంటూ.. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే ఇక మహిళా టీమిండియా జట్టులో స్టార్ ప్రేయర్ గా కొనసాగుతున్న స్మృతి మందానకు భారీ రేంజ్ లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.



 అయితే కేవలం ఆమె ఆట తీరుకు మాత్రమే కాదు ఆమె అందం అభినయానికి కూడా కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం టీమిండియాలో కీలక ప్లేయర్ కాకుండా సాగుతున్న స్మృతి మందానా టీమ్ ఇండియా విజయాలలో ఎప్పుడు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. అయితే గత కొంతకాలం నుండి  స్మృతి మందాన  రిలేషన్స్ లో ఉంది అంటూ ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో స్మృతి మందాన డేటింగ్ లో మునిగి తేలుతుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలకు బలం చేకూర్చేలా కొన్ని ఘటనలు కూడా తెరమీదకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే.



 ఈ విషయాన్ని ఇటీవలే అధికారికంగా ప్రకటించింది ఈ టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్. ఏకంగా మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ తో తాను రిలేషన్షిప్ లో ఉన్నట్లు అధికారిక ప్రకటన చేసింది. తమ ప్రేమ బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయి అంటూ తెలిపింది. అంతేకాకుండా తన ప్రియుడితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే ఈ పోస్ట్ కోసం  స్మృతి మందాన లవ్ సింబల్స్ తో కామెంట్ చేయడం గమనార్హం. ఇలా ఎన్నో రోజుల నుంచి స్మృతి మందాన పలాష్ డేటింగ్ లో ఉన్నట్లు వస్తున్న వార్తlu రాగా.. ఇక ఇప్పుడు అందరికీ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: