ఈ క్రమంలోనే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇలా వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన టీమ్ ఇండియాకు ఏకంగా బీసీసీఐ భారీ నజరానాను కూడా ప్రకటించింది. 125 కోట్ల భారీ నజరానాను ప్రకటించగా ఇక ఇటీవలే భారత జట్టు వరల్డ్ కప్ ట్రోఫీతో టీమిండియా కు చేరుకోగా ముంబై వీధుల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఆ తర్వాత ముంబైలోని వాంటెడ్ స్టేడియంలో నిర్వహించిన ఈవెంట్లో టీమ్ ఇండియా ఆటగాళ్లు అందరికీ కూడా 125 కోట్ల చెక్కును బీసీసీఐ సెక్రటరీ జై షా అందించారు అని చెప్పాలి. దీనితో ఇక ఇందులో ఎవరికి ఎంత మొత్తంలో అందుతుంది అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.
ఇదిలా ఉంటే 2024 t20 వరల్డ్ కప్ కి ముందు టీమిండియా చివరన గెలిచిన వరల్డ్ కప్ 2011 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ కావడం కమనార్హం. ధోని కెప్టెన్సీలో ఇలా వరల్డ్ కప్ గెలిచి రికార్డు సృష్టించింది టీమిండియా. అయితే ఇక ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు 125 కోట్లు నజరానా ప్రకటించిన నేపథ్యంలో.. 2011 వరల్డ్ కప్ లో ఎంత రివార్డు ఇచ్చారు అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. అప్పట్లో ఆటగాళ్లు తలో రెండు కోట్లు పారితోషకంగా అందుకున్నారు. 2007లో టి20 వరల్డ్ కప్ గెలిచినప్పుడు జట్టు మొత్తానికి కలిపి 12 కోట్ల నజరానాను ప్రకటించింది బీసీసీఐ. 2013 లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచినప్పుడు ఒక్కో ఆటగాడికి కోటి రూపాయల చొప్పున నజరానా ప్రకటించింది అని చెప్పాలి.