ఇండియన్ క్రికెట్ లో కొత్త ప్రతిభకు కొదవలేదు అన్న విషయం తెలిసిందే. భారత్లో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఎంతోమంది యువ ఆటగాళ్లు క్రికెట్ నే ప్యాషన్ గా మార్చుకుంటూ ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటికప్పుడు తమ సత్తా ఏంటో నిరూపించుకుంటున్నారు అని చెప్పాలి. ఇలా అదిరిపోయే ప్రదర్శనలు చేస్తూ ఏకంగా భారత సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. ఇక ఈ మధ్యకాలంలో టీమిండియాలో సీనియర్ ప్లేయర్ల కంటే యువ ఆటగాళ్లదే ఎక్కువ హవా నడుస్తుంది. సెలెక్టర్లు సైతం ప్రతిభగల యంగ్ ప్లేయర్స్ కే పెద్ద పీట వేస్తూ ఉన్నారు అని చెప్పాలి.


 అయితే ఒకప్పుడు ఇలా భారత క్రికెట్లో తెలుగు ప్లేయర్లు పెద్దగా కనిపించే వాళ్ళు కాదు. కానీ ఈ మధ్యకాలంలో తెలుగు ప్లేయర్లు సైతం అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఐపీఎల్ సహ ఏకంగా టీమ్ ఇండియాలో కూడా వరుసగా చాన్సులు దక్కించుకుంటున్నారు. ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో కీలక బౌలర్గా కొనసాగుతున్నాడు. ఇక యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, నితీష్ రెడ్డి లాంటి వాళ్లు ఇక తాము టీమిండియా ఫ్యూచర్ అని ఇప్పటికే నిరూపించుకున్నారు. కాగా ఇప్పుడు మరో తెలుగు క్రికెటర్ తెరమీదకి వచ్చాడు. తన మెరుపు బ్యాటింగ్ తో అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఇక అదిరిపోయే హాఫ్ సెంచరీ చేసి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.


 ఆ ప్లేయర్ ఎవరో కాదు ప్రశాంత్.వైజాగ్ వేదికగా జరుగుతున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో సంచలన హాఫ్ సెంచరీ నమోదయింది. బెజవాడతో జరిగిన మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ బ్యాట్స్మెన్ ప్రశాంత్ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసేసాడు. దీంతో ఆంధ్ర ప్రీమియర్ లీగ్ హిస్టరీలోనే ఇది ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇక అతను ఇన్నింగ్స్ లో ఓకే ఓవర్ లో 4 6 6 6 4 6 తో ఏకంగా 32 పరుగులు బాదేశాడు అని చెప్పాలి. మొత్తంగా ఈ మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ 171 పరుగులు చేయగా.. చివరికి భారీ తేడాతో బెజవాడ జట్టు పై విజయం సాధించింది. కాగా ప్రశాంత్ మెరుపు హాఫ్ సెంచరీ పై  అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: