టీమిండియా మాజీ కెప్టెన్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఇటీవల తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు దశాబ్ద కాలం నుంచి కూడా టీం ఇండియాకు మూడవ స్థానంలో బ్యాటింగ్ చేస్తూ వస్తున్నాడు విరాట్ కోహ్లీ. అయితే కోహ్లీ మూడు ఫార్మాట్లలో కూడా అదరగొడుతూ ఇక ఎన్నో రికార్డులు క్రియేట్ చేసేవాడు. టీమిండియా విజయాలలో  కీలకపాత్ర వహించేవాడు అని చెప్పాలి. అలాంటి విరాట్ కోహ్లీని ఇక మూడవ స్థానం నుంచి తప్పించేందుకు ఎప్పుడు బీసీసీఐ కూడా సహసం చేయలేదు. ఇలా టీమ్ ఇండియా లో మూడో స్థానం బ్యాటింగ్ అంటే విరాట్ కోహ్లీదే అని అటు అభిమానులు కూడా ఫిక్స్ అయిపోయారు అని చెప్పాలి.


 కానీ ఇటీవల విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇక ఇప్పుడు కోహ్లీ ఎప్పుడు బ్యాటింగ్ చేసే మూడో స్థానంలో బరిలోకి దిగి ఇక కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయబోయే బ్యాటర్ ఎవరు అనే విషయంపై గత కొంతకాలం నుంచి చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం గ్రిల్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ ఇండియా జింబాబ్వే పర్యటనలో ఉండగా కోహ్లీ.. మూడో స్థానంలో అటు ఋతురాజు గైక్వాడ్ బ్యాటింగ్ చేస్తూ ఉండడం గమనార్హం. ఏకంగా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అయితే రుతురాజ్ అటు కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగలడా కోహ్లీని మరిపించగలడా అనే విషయంపై ఇటీవల ఈ యంగ్ ప్లేయర్స్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 భారత జట్టులో విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడం కష్టం అంటూ ఋతురాజ్  గైక్వాడ్ చెప్పుకొచ్చాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడంపై ఇటీవల మీడియాతో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోని స్థానంలో ఉండడం ఎంత కష్టమో.. ఇక విరాట్ కోహ్లీ స్థానంలో టీమ్ ఇండియా తరపున మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడం కూడా అంతే కష్టం. నన్ను కోహ్లీతో  పోల్చడం సరైనది కాదు. నా దృష్టి అంతా కేవలం ఆటపైన మాత్రమే ఉంది. అయితే జట్టు అవసరాల నిమిత్తం ఏ స్థానంలో ఆడటానికి అయినా కూడా నేను సిద్ధంగానే ఉంటాను అంటూ ఋతురాజ్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: