బెంగాల్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ నక్క తోక తొక్కినట్లు ఉన్నాడు. అతడు భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్ గంభీర్ సహాయ బృందంలో చేరే అవకాశం ఉందని రిపోర్ట్స్‌ పేర్కొంటున్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మంగళవారం (జులై 9) గంభీర్‌ను భారత క్రికెట్ జట్టు కొత్త హెడ్ కోచ్‌గా నియమించింది.

ప్రకటన తర్వాత, మిగిలిన కోచింగ్ స్టాఫ్ పోస్టుల కోసం అన్వేషణ ప్రారంభమైంది. బీసీసీఐ ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల కోసం వెతుకుతోంది.  క్రిక్‌బజ్ నుంచి వచ్చిన నివేదిక ప్రకారం, కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ అయిన అభిషేక్ నాయర్ భారత జట్టుకు కొత్త అసిస్టెంట్ కోచ్‌గా మారవచ్చు. మాజీ ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ అతని పాత్రలో కొనసాగాలని భావిస్తున్నారు. గంభీర్‌ స్వయంగా బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. బౌలింగ్ కోచ్ పదవికి, bcci, గంభీర్‌ కలిసి లక్ష్మీపతి బాలాజీ, వినయ్ కుమార్ వంటి అభ్యర్థులను పరిశీలిస్తున్నారు, వీరిద్దరూ గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌లో గంభీర్‌తో కలిసి పనిచేశారు.

42 ఏళ్ల గౌతమ్ గంభీర్ రాహుల్ ద్రవిడ్ నుంచి టీమ్ ఇండియా హెడ్ కోచ్ బాధ్యతలు స్వీకరించాడు. రాహుల్ ద్రవిడ్ పదవీకాలం t20 ప్రపంచ కప్ 2024 తర్వాత ముగిసింది. గంభీర్ 2027, జులై వరకు జట్టుకు కెప్టెన్ గా ఉంటాడు. ఇటీవల గంభీర్ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు IPL 2024లో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. గంభీర్ నాయకత్వంలో లక్నో సూపర్ జెయింట్స్ IPLలో వరుసగా ప్లేఆఫ్‌కు చేరినట్లు గుర్తించారు.

త్వరలోనే టీమిండియా-శ్రీలంక మధ్య వైట్-బాల్ సిరీస్‌ జరగనుంది. దీనికి గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తాడు. ఇందులో మూడు వన్డేలు (ODIs), మూడు T20లు ఉంటాయి. అయన కోచ్ పదవీకాలం 2027 వన్డే వరల్డ్ కప్‌తో ముగుస్తుంది. ఈ క్రమంలో, గంభీర్ అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. అందులో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్, 2025 ICC చాంపియన్స్ ట్రోఫీ, 2023-25 ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: