తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భారత ప్రపంచ కప్ గెలుపులో అత్యంత ముఖ్యపాత్ర పోషించిన రాహుల్ ద్రవిడ్‌కు ఒక స్పెషల్ థాంక్స్ చెప్పుకున్నారు. 2021 నవంబర్‌లో భారత జట్టు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ 2024, జూన్ 29న దిగిపోయారు. ఆ రోజు భారత్ జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి 11 సంవత్సరాల తర్వాత ఐసీసీ టీ20 ట్రోఫీని గెలుచుకుంది.  అలా ధోని-గ్యారీ కిర్‌స్టన్, ధోని-లక్ష్మీపతి రాజు జంటల తరహాలోనే రోహిత్-ద్రవిడ్ జంట కూడా భారతదేశానికి వరల్డ్ కప్‌ను అందించారు. ఇకపై రోహిత్ వన్డేలు, టెస్ట్‌లలో కెప్టెన్‌గా కొనసాగుతారు కానీ, ద్రవిడ్‌ స్థానంలో కొత్త కోచ్ వచ్చారు.

రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్ కలిసి భారత క్రికెట్ టీమ్ కు అద్భుతమైన విజయాలు అందించారు. ఆసియా కప్ గెలవడం, 2023 వన్డే వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు చేరుకోవడం, భారత్‌ను నంబర్ 1 వన్డే, టెస్ట్ జట్టుగా చేయడం వంటి ఘనతలు సాధించారు. అందుకే, దాదాపు మూడు సంవత్సరాల పాటు కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ రోహిత్ శర్మ తన మనసులోని భావాలను వ్యక్తం చేశారు.

"ప్రియమైన రాహుల్ భాయ్, నా భావాలను సరిగ్గా వ్యక్తీకరించడానికి నేను సరైన పదాల కోసం వెతుక్కుంటున్నా, నా మనసులోని భావాలను కరెక్ట్ గా ఎక్స్‌ప్రెస్ చేస్తారని అనుకోవడం లేదు. ఇదిగో నా ప్రయత్నం," అని 2007లో ద్రావిడ్ నేతృత్వంలో భారత్‌లో అరంగేట్రం చేసిన రోహిత్ ఒక ఇన్‌స్టా పోస్ట్ స్టార్ట్ చేశాడు.

 "నా చిన్నతనం నుంచి నేను మిమ్మల్ని కోట్లాది మంది ఫాలోవర్ల లాగానే చూస్తూ వచ్చాను. కానీ మీతో టీమిండియా విజయాల కోసం పని చేసే అదృష్టం నాకు కలిగింది. ఈ ఆటలో మీరు ఒక లెజెండ్, కానీ మీరు మీ ప్రశంసలు, విజయాలన్నింటినీ వదిలిపెట్టి, మాలాగా నడిచారు. కోచ్ అయినా మీతో ఏదైనా చెప్పగలిగేంత స్వేచ్ఛ మాకు ఇచ్చారు."

"మీ వినమ్రత, ఈ ఆట పట్ల మీకున్న అంతులేని ప్రేమే మీ వరం. మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకున్నా. మణం కలిసి పనిచేసిన ప్రతి క్షణాన్ని నేను ఎప్పటికీ గుర్తుంచుకుంటా. నా భార్య మిమ్మల్ని నా "వర్క్ వైఫ్" అని పిలుస్తుంది. మిమ్మల్ని నా స్నేహితుడిగా పిలవడం నా అదృష్టం." అని రోహిత్ ఒక ఎమోషన్ పోస్టు షేర్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: