ఒకప్పటి స్టార్ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ అప్పటి టీం ఇండియా టీం లో స్టార్ ప్లేయర్ గా ఎన్నో సమయాల్లో ఇండియా విజయానికి కారణమయ్యారు. ద్రవిడ్ నిలబడ్డాడు అంటే ఆ మ్యాచ్ విన్ అయ్యినట్టే లెక్క. ఆడేది వన్ డే నా, టెస్టా అన్నది కాదు వికెట్ల ముందు వాల్ గా ద్రవిడ్ తన పాగా వేస్తాడు. ఇక ఇప్పుడు ఆయన కోచ్ గా కూడా టీం ఇండియాకు ఉత్తమమైన సేవలు అందించాడు.

లేటెస్ట్ గా టీం ఇండియా టీ 20 వరల్డ్ కప్ విన్ అవ్వడం వెనక ద్రవిడ్ కోచింగ్ కూడా ఎంతోకొంత ఉపయోగపడిందన్ చెప్పొచ్చు. ఐతే టీం ఇండియా 13 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్ విన్ అయినందుకు బిసిసై టీం ఇండియాకు 125 కోట్ల నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ద్రవిడ్ కు ఆటగాళ్ల తో సమానంగా 5 కోట్ల దాకా ఇచ్చేలా బిసిసిఐ ప్రతిపాదన చేసిందట. ఐతే తనతో సహాయక సిబ్బంది బౌలింగ్ కోచ్, బ్యాటింగ్ కోచ్ కు మాత్రం 2.5 కోట్లు మాత్రమే ఇచ్చేలా ప్రతిపాదన చేశారట.

ఐతే బిసిసిఐ తో తనకు కూడా రెండున్నర కోట్లు చాలని చెప్పాడట ద్రవిడ్. ఎవరైనా డబ్బులు ఎక్కువ ఇస్తానంటే మరోమాట మాట్లాడకుండా తీసుకుంటారు కానీ ద్రవిడ్ మాత్రం తన సహాయక సిబ్బంది తో పాటే తనకు కూడా రెండున్నర కోట్లు చాలని అన్నాడట. ఈ విషయం తెలిసి క్రికెట్ అభిమానులు ద్రవిడ్ ని మరింత ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇక టీం ఇండియా కోచ్ గా ద్రవిడ్ పదవి కాలం పూర్తి కాగా టీం ఇండియాకు కొత్త కోచ్ గా గౌతం బంభీర్ ని ఎంపిక చేసింది బిసిసిఐ. ప్రస్తుతం జింబాంబ్వే తో టీం ఇండియా ఐదు టీ20 ల సీరీస్ ఆడుతుంద్. ఇందులో ఇండియా నుంచి యువ ఆటగాళ్లు వెళ్లారు. నేటితో 3 మ్యాచ్ లు పూర్తి కాగా ఇండియా రెండిటిలో విజయం సాధించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: