ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఆకట్టుకున్నాడు. ఏకంగా స్టార్ బౌలర్ లను సైతం చెడుగుడు ఆడేశాడు. బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపించి ఇక మహా మహా ప్లేయర్లకు సైతం వనికించాడు. ఇక సెలక్టర్ల చూపును ఆకర్షించి టీమిడియాలో కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు ఈ క్రమంలోనే వచ్చిన అవకాశాన్ని కూడా ఎంతో బాగా సద్వినియోగం చేసుకున్నాడు. ఏకంగా జింబాబ్వేతో జరుగుతున్న 5 t20 ల సిరీస్ లో భాగంగా రెండో టి20 లో బరిలోకి దిగిన అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఏకంగా మెరుపు సెంచరీ చేసి అందరి దృష్టి తన వైపుకు తిప్పుకున్నాడు. దీంతో అతనికి తిరుగు ఉండదు అని అందరూ అనుకున్నారు.
కానీ ఊహించని రీతిలో మూడో టి20 మ్యాచ్ లు మాత్రం అతన్ని బ్యాటింగ్ ఆర్డర్ మారిపోయింది ఏకంగా ఓపెనర్ గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మను మూడో స్థానంలో పంపించాడు కెప్టెన్ గిల్. రెగ్యులర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్ చివరికి ఫస్ట్ డౌన్ లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. అయితే ఈ మార్పుతో తీవ్రంగా నిరాశపడిన అతను తొమ్మిది బంతుల్లో ఆడి పది పరుగులు మాత్రమే చేసి వికెట్ కోల్పోయాడు. అయితే ఇక ఇలా విరాట్ కోహ్లీ తర్వాత ఈ చెత్త రికార్డును అభిషేక్ శర్మ ఖాతాలో చేరింది. గతంలో కోహ్లీకి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ గా బరిలోకి దిగి సెంచరీ చేసిన కోహ్లీ తర్వాత మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్ దిగారు. తర్వాత రెండు పరుగులు చేసి చివరికి అవుట్ అయ్యాడు. అయితేఅభిషేక్ శర్మకు కూడా కోహ్లీ లాగే జరిగింది. దీంతో కెప్టెన్ గిల్ నిర్ణయం పై అందరూ మండిపడుతున్నారు.