ఫార్మాట్లో టీమ్ ఇండియా ఇటీవలే విశ్వవిజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే. అప్పుడేప్పుడో 2007లో టి20 ఫార్మాట్ ను వరల్డ్ లో క్రికెట్లో ప్రవేశపెట్టినపుడు.. ఇక ప్రపంచ కప్ టైటిల్ నెగ్గిన టీమిండియా అప్పటినుంచి ఒక్కసారి కూడా ఇక వరల్డ్ కప్ టైటిల్ అందుకోలేకపోయింది. అయితే ఇటీవల సుదీర్ఘ నిరీక్షణకు తెరదింపుతూ రోహిత్ సేన వరల్డ్ కప్ టైటిల్ని ముద్దాడింది. అది కూడా ఒక్క ఓటమి కూడా లేకుండా. ఇక వరల్డ్ కప్ లో జైత్రయాత్రను కొనసాగించి ఇలా టైటిల్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.


 అయితే వరల్డ్ కప్ ట్రోఫీతో అటు స్వదేశాలకు చేరుకున్న రోహిత్ సేనకు ఘన స్వాగతం లభించింది అన్న విషయం తెలిసిందే  ఏకంగా వాంకడే స్టేడియంలో టీమ్ ఇండియా క్రికెటర్లు అందరిని కూడా అభినందించేందుకు ఒక ప్రత్యేకమైన నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ సమయంలో ఏకంగా భారత జట్టును సన్మానించి 125 కోట్ల నజరానాను బీసీసీఐ బహుమతిగా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే  అయితే ప్లేయర్లతో సహమానంగానే అటు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కి  కూడా ఐదు కోట్లు దక్కాయి


 ఈ నజరానా విషయంలో రోహిత్ ప్రవర్తించిన తీరు మాత్రం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటుంది అని చెప్పాలి  బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్ మనీతో సపోర్ట్ స్టాఫ్ కు తక్కువ మొత్తంలో అందడంపై.. అదే రోజు రోహిత్ శర్మ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. జట్టు విజయం కోసం అహర్నిశలు ఎంతో కృషి చేసిన స్టాప్ కు అంత తక్కువ అమౌంట్ ఇవ్వడం ఏంటి అని ప్రశ్నించాడట. అంతే కాకుండా తనకు ఇచ్చిన ఐదు కోట్ల రూపాయలను కూడా ఇలా సపోర్టింగ్ స్టాఫ్ కి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఇక ఈ విషయాన్ని భారత సపోర్టింగ్ స్టాఫ్ లోని ఓ సభ్యుడు చెప్పినట్లు తెలుస్తోంది. సపోర్టింగ్ స్టాఫ్ కి కూడా అధిక మొత్తం అందాలని.. అది సాధ్యం కాకపోతే తన బోనస్ను కూడా వాళ్లకు ఇచ్చేస్తానని హిట్ మాన్ చెప్పడంతో డ్రెస్సింగ్ రూమ్ లో అందరూ ఆశ్చర్యపోయారట. ఈ విషయం తెలిసి ఇక రోహిత్ ఫాన్స్ అయితే కాలర్ ఎగరేసుకుంటున్నారు అని చెప్పాలి

మరింత సమాచారం తెలుసుకోండి: