అయితే ఇలా హెడ్ కోచ్గా వచ్చిన గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా సెలెక్టర్ల ముందు కొన్ని నిబంధనలు పెట్టినట్లు తెలుస్తోంది. తనతో పాటు కోచింగ్ స్టాఫ్ ని కూడా తానే ప్రత్యేకంగా ఎంచుకుంటానని గౌతమ్ పేరు చెప్పాడట. దానికి బీసీసీఐ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ద్రవిడితో పాటు అసిస్టెంట్ కోచ్ లుగా చేసిన వారి స్థానంలో కొత్తవారిని తీసుకోవాలని గంభీర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. తన మైండ్ సెట్ తో తన పనితో సింక్ అయ్యే వారే.. ఇక తన కోచింగ్ స్టాఫ్ లో ఉండాలని అనుకుంటున్నారట గంభీర్. ఈ క్రమంలోనే ఇప్పుడు టీమిండియాలోకి ఏకంగా నెదర్లాండ్స్ మాజీ ఆటగాడు ఒకరు రాబోతున్నారు అన్నది తెలుస్తోంది
బ్యాక్ రూమ్ స్టాఫ్ గా నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్ రాం టెన్ డస్కేట్ ను తీసుకోవాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈ విషయంపై ఈ మాజీ క్రికెటర్ సంప్రదింపులు కూడా జరిపాడట. ఇక బిసిసిఐ కి కూడా ఈ విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. కాగా డస్కటే 2006 నుంచి 2011 మధ్యకాలంలో అంతర్జాతీయ క్రికెట్ లో అదరగొట్టాడు ఐపీఎల్ లో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు తరుపున కూడా ఆడాడు. లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తూ మంచి హిట్టింగ్ తో అదరగొట్టేవాడు. ఇక స్ట్రైట్ సిక్సర్లు కొట్టడంలో అతను దిట్ట అని చెప్పాలి. ఇక అతని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో 33 వన్డేలు,24 t20 మ్యాచ్ లు ఆడాడు. ఐపీఎల్ 29 మ్యాచులు ఆడాడు. అయితే తన మైండ్ సెట్ కి బాగా సెట్ అవుతాడని భావించిన గౌతమ్ గంభీర్ అతని తన కోచింగ్ స్టాఫ్ లోకి తీసుకోవాలని అనుకుంటున్నాడు.