సాధారణంగా క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఇక జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాటింగ్ ఆర్డర్ దగ్గర నుంచి బౌలింగ్ ఆర్డర్ వరకు ఎవరిని ఎప్పుడు ఆడించాలి అనే విషయంపై పూర్తిస్థాయి క్లారిటీతో ఉండాలి. అయితే ఎవరికి ఏ స్థానం సెట్ అవుతుంది అన్న విషయంపై కూడా ముందే ఒక అవగాహనకు రావాలి. ఇక ఎవరైనా ఆటగాడు ఒక స్థానం కాకుండా మరో స్థానంలో బాగా రానిస్తే ఇక ఆ స్థానంలోనే అతనికి వరుసగా అవకాశాలు ఇవ్వాలి.


 ఇలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మాత్రం కొన్ని కొన్ని సార్లు చివరికి విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల జింబాబ్వే పర్యటనలో భాగంగా టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న గిల్ విషయంలో ఇలాంటి విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అటు భారత జట్టు విజయం సాధించినప్పటికీ కెప్టెన్ గిల్ తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా మందికి నచ్చడం లేదు. రెండో టి20 మ్యాచ్ లో సూపర్ సెంచరీ తో చెలరేగిపోయిన అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్థానాన్ని మార్చుతూ గిల్ నిర్ణయం తీసుకున్నాడు.


 ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసినా రెండో మ్యాచ్ లోనే సెంచరీ బాదిన ఓపెనర్ అభిషేక్ శర్మ మూడవ మ్యాచ్ లో ఏకంగా మూడవ స్థానంలో వచ్చి పది పరుగులకే అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే సెంచరీ చేసిన ఆటగాడి స్థానం మార్చడం ఏంటి అంటూ గిల్ పై విమర్శలు వస్తున్నాయి. వన్డౌన్ తాను వెళ్లకుండా అభిషేక్ను డిమోట్ చేసారంటూ.. ఇక టీమిండియా ఫ్యాన్స్ అందరూ కూడా మండిపడుతున్నారు. తనకు కాకుండా అభిషేక్ కు ఎక్కడ పేరు వస్తుందో అనే కారణంతోనే గిల్ ఇలా చేశాడు అంటూ విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: