ఈ క్రమంలోనే వరల్డ్ కప్ ముగిసి రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇంకా వరల్డ్ కప్ లో చెత్త ప్రదర్శన చేసిన జట్లపై వస్తున్న విమర్శలు మాత్రం అస్సలు ఆగడం లేదు. అంతేకాదు ఇలా చెత్త ప్రదర్శన చేసి అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించిన కొన్ని టీమ్స్ విషయంలో ఇక ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే t20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లలో శ్రీలంక కూడా ఒకటి. వరల్డ్ కప్ రేస్ లో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్న శ్రీలంక.. కనీసం సూపర్ 8 లో కూడా అడుగుపెట్టలేక నిష్క్రమించింది.
దీంతో ఆ జట్టు ఆట తీరుపై ఎంతల విమర్శలు వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వరల్డ్ కప్ లో శ్రీలంక జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి వానిందు హసరంగా ఇటీవల షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. టి20 వరల్డ్ కప్ లో తమ జట్టు ఘోర ప్రదర్శన చేయడంతో ఈ ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే భారత్తో జరగబోయే సిరీస్ కి ముందు ఇలా హసారంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం మాత్రం చర్చనీయాంశంగా మారింది అయితే గత ఏడాది అతను టి20 కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. అతని సారధ్యంలో కేవలం పది మ్యాచ్ లలో మాత్రమే శ్రీలంక ఆడింది. ఇక ఇప్పుడు అతను మళ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్గా ఎవరు రాబోతున్నారు అనే విషయంపై చర్చ జరుగుతుంది.