ప్రస్తుతం భారత క్రికెట్ లో ఎక్కడ చూసిన కూడా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే గౌతమ్ గంభీర్ ఏం చేయబోతున్నాడు అని. సాధారణంగానే గౌతమ్ గంభీర్ ఎంతో దూకుడుగా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. అయితే తన జట్టులో ఆటగాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే వారిపై తన ఆగ్రహాన్ని చూపిస్తూ ఉంటాడు. అలాంటి గౌతమ్ గంభీర్ గతంలో ఐపీఎల్ లో ఆడుతున్న సమయంలో ఎంతో మంది ఆటగాళ్లతో వివాదాలు పెట్టుకోవడం కూడా చూసాం. చిన్నచిన్న కారణాలకే ఇలా వివాదాలు పెట్టుకుని ఎన్నోసార్లు వార్తల్లో నిలిచాడు.


 అలాంటి గంభీర్  ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ పదవీ బాధ్యతలు చేపట్టాడు. ఈ క్రమంలోనే ఈ బాధ్యతలు దక్కక ముందే  బీసీసీఐ పెద్దల ముందు కొన్ని డిమాండ్లు కూడా ఉంచాడు. దీంతో హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ జట్టులో ఎలాంటి మార్పులు తీసుకురాబోతున్నాడు. ఇక ఎవరి పట్ల కఠినంగా వ్యవహరించబోతున్నాడు అనే విషయంపై ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా చర్చ జరుగుతుంది. మరి ముఖ్యంగా టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించి మిగతా రెండు ఫార్మట్ లలో కొనసాగుతున్న సీనియర్లు జడేజా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల విషయంలో అటు గౌతమ్ గంభీర్ ఎలా ఉంటుంది అనే విషయం హాట్ టాపిక్ గా మారింది.



 ఇలాంటి చర్చ జరుగుతున్న సమయంలో భారత జట్టులోని ఆటగాళ్లు అందరిని కూడా ఉద్దేశిస్తూ నూతన కోచ్ గౌతమ్ గంభిర్ అందరికీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడు అన్నది తెలుస్తోంది. అందరూ అన్ని ఫార్మాట్లు ఆడాల్సిందే అంటూ తేల్చి చెప్పాడట. టి20, వన్డేలు, టెస్ట్ ఫార్మాట్లకు వేరు వేరు ఆటగాళ్లను ఆడించే ఫార్ములా పై తనకు అస్సలు నమ్మకం లేదు అంటూ స్పష్టం చేశాడట గంభీర్. అయితే ఆటగాళ్లు గాయాల బారిన పడటం సహజమేనని.. అలాంటి ఆటగాళ్లు కోలుకొని మళ్లీ వచ్చిన తర్వాత మూడు ఫార్మాట్లలో కూడా ఆడాల్సిందే అని గౌతమ్ గంభీర్ ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాడట. అయితే ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ కు దూరంగా ఉంటున్న హార్దిక్ పాండ్యా కెరియర్ ప్రమాదంలో పడినట్లే అని కొంతమంది చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: