ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు మంచి జోష్ లో ఉంది. కొన్ని రోజుల క్రితమే టీం ఇండియా జట్టు టీ 20 వరల్డ్ కప్ లో 8 మ్యాచ్ లను ఆడి 8 మ్యాచ్ ల లోను గెలుపొంది టీ 20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. ఇకపోతే టీ 20 వరల్డ్ కప్ లాంటి భారీ ట్రోఫీ నీ అందుకున్న తర్వాత భారత జట్టు జింబాబ్వే తో టీ 20 సిరీస్ లో పాల్గొంది. ఇప్పటికే ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. ఇందులో ఇండియా జట్టు ఏకంగా మూడు మ్యాచ్ లలో గెలుపొందింది. ఇది ఇలా ఉంటే ఈ రోజు మ్యాచ్ లో భారత జట్టు అద్భుతమైన రికార్డును నెలకొల్పింది.

ఇక ఈ రోజు భారత జట్టు జింబాబ్వే పై ఎలాంటి రికార్డును నెలకొల్పింది అనే వివరాలను తెలుసుకుందాం. ఈ రోజు భారత్ , జింబాబ్వే జట్ల మధ్య మ్యాచ్ జరగగా అందులో మొదటగా జింబాబ్వే జట్టు బ్యాటింగ్ చేసి 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా విజయాన్ని అందుకుంది. ఇండియా జట్టు 15.2 ఓవర్స్ ముగిసే సరికి 156 పరుగులు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ రోజు మ్యాచ్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన జైస్వాల్ 93 పరుగులు చేసి నాటౌట్ గా నిలవగా , గిల్ 58 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇక షార్ట్ ఫార్మేట్ లో వికెట్లు కోల్పోకుండా భారత్ చేదించిన అత్యధిక స్కోర్ ఈ మ్యాచ్ కావడం విశేషం. ఇలా ఈ రోజు మ్యాచ్ తో ఇండియా అదిరిపోయే రేంజ్ విక్టరీని అందుకొని ఒక రేర్ రికార్డును కూడా సృష్టించింది. ఇక ఈ రోజు మ్యాచ్ తో జైస్వాల్ , గిల్ కి అద్భుతమైన గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: