సాధారణంగా క్రికెట్లో ఈ మధ్యకాలంలో యువ ఆటగాళ్ల హవా పెరిగిపోయింది. ఇక వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటూ అదరగొట్టేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తమలోని ప్రతిభను నిరూపించుకుంటూ జట్టులో తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉన్నారు ఎంతో మంది యువ ఆటగాళ్లు. ఈ క్రమంలోనే తామే ఇక వరల్డ్ క్రికెట్లో కాబోయే ఫ్యూచర్ స్టార్స్ అన్న విషయాన్ని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా అద్భుతమైన ప్రదర్శన చేశాడు అంటే చాలు అతని గురించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి.


 ఇక ఇప్పుడు ఇలాగే ఏకంగా బౌలింగ్ తో నిప్పులు చెరిగి ప్రత్యర్ధులను వనికించిన ఒక యంగ్ బౌలర్ గురించిన వార్త వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఇంగ్లాండు క్రికెట్లో లెజెండరీ ప్లేయర్ జేమ్స్ అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దాదాపు తన ఇరవై ఒకేలా క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఒక లెజెండరీ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించడం లేదు. మరో లెజెండ్ ఇంగ్లాండ్ జట్టు లోకి వచ్చేసాడా అంటే ఇక్కడ ఒక యువ ఆటగాడు ప్రదర్శన చూస్తూ ఉంటే అందరూ అని చెప్పకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల ఒక యంగ్ ప్లేయర్ ఇంగ్లాండ్ జట్టులోకి అరంగేట్రం మ్యాచ్లో సంచలన ప్రదర్శన చేశాడు.



 ఇంగ్లాండ్ ఫేసర్ గుస్ అట్కిన్సన్ అరుదైన రికార్డు సృష్టించాడు. అరంగేట్రం  టెస్ట్ మ్యాచ్ లోనే 12 వికెట్లు తీసిన ఆరో బౌలర్గా రికార్డు సృష్టించాడు. అంతేకాదు బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన ఆటగాడిగా మరో ఘనతను సాధించాడు. 12 / 106 గణాంకాలను నమోదు చేశాడు ఈ ఆటగాడు. వెస్టిండీస్ ఫై టెస్టులో ఈ రికార్డు నమోదు చేశాడు అని చెప్పాలి. 1879లో ఫాస్ట్ బౌలర్ బ్రెడ్ మార్టిన్ ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ లో 12 వికెట్లు, 1972లో బాబ్ మాస్సి ఆస్ట్రేలియాతో మ్యాచ్లో 16 వికెట్లు పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 114 పరుగులు తేడాతో వెస్ట్ ఇండీస్ ఫై ఇంగ్లాండ్ ఘన విజయాన్ని అందుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: