ఇటీవల వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా అద్భుతమైన ప్రస్థానాన్ని  కొనసాగించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అదిరిపోయే ప్రదర్శన చేసి ఏకంగా వరల్డ్ కబ్ టైటిల్ ని గెలుచుకోగలిగింది. ఇక టి20 ఫార్మాట్లో దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తరలించుతూ ఇక ప్రపంచ ఛాంపియన్ గా అవతరించగలిగింది టీం ఇండియా. అయితే ఇలా వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలోనే టీమ్ ఇండియాలో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ రవీంద్ర జడేజాలు తమ అంతర్జాతీయ టి20  కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు అన్న విషయం తెలిసిందే.


 దీంతో అభిమానులు అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు. ఇలా టి20 ఫార్మాట్ నుంచి సీనియర్ ప్లేయర్లు తప్పుకున్న నేపథ్యంలో ఇక వారి స్థానాన్ని ఎవరు భర్తీ చేయబోతున్నారు అనే విషయంపై చర్చ జరుగుతుంది. మరీ ముఖ్యంగా రవీంద్ర జడేజా లాంటి నిఖార్సైన ఆల్రౌండర్ మళ్ళీ టీమిండియా కు దొరుకుతారా.. అతని స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే విషయం గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే జడేజా అటు బౌలింగ్లో అదరగొట్టడమే కాదు బ్యాటింగ్ లోను విధ్వంసం సృష్టిస్తాడు. ఇక ఫీల్డింగ్  లోను ఎన్నో విన్యాసాలు చేస్తూ ప్రేక్షకులను అబ్బుర పరుస్తూ ఉంటాడు అని చెప్పాలి.



 అయితే ఇటీవల యంగ్ టీమ్ ఇండియా ఐదు మ్యాచ్లలో టి20 సిరీస్ ఆడింది. అయితే ఈ టి20 సిరీస్ ముగిసిన తర్వాత జడేజా స్థానాన్ని భర్తీ చేయబోయే ఆటగాడు ఇతడే అంటూ ఒక పేరు వైరల్ గా మారిపోయింది. జింబాబ్వేతో జరిగిన టి20 సిరీస్ లో వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా రాణించాడు. తాను జడేజా వారసత్వాన్ని అందుకునే రేసులో ముందు ఉన్నాను అని మెసేజ్ ని అందరికీ పంపించాడు. ఈ సిరీస్లో ఐదు మ్యాచ్ల్లో మెరుగైన గణాంకాలు నమోదు చేశాడు వాషింగ్టన్ సుందర్. 5.16 ఎకానమీతో మంచి గణాంకాలు నమోదు చేసిన వాషింగ్టన్ సుందర్ ఎనిమిది వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: