టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నేటి తరానికి వరల్డ్ క్రికెట్లో ఉన్న ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లలో రోహిత్ శర్మ మొదటి వరుసలోనే ఉంటాడు టీమిండియా. కెప్టెన్ గా మాత్రమే కాదు.. ఇక స్టార్ బ్యాట్స్మెన్ గా కూడా హవా నడిపిస్తున్నారు ఈ ఆటగాడు. అందుకే అభిమానులు అందరూ చేత హిట్ మాన్ అని కూడా పిలిపించుకుంటూ ఉంటాడు. ఎంతో అలవోకగా డబుల్ సెంచరీలు బాధేస్తూ ప్రత్యర్థులపై పూర్తిస్థాయి ఆదిపత్యాన్ని వివరిస్తూ ఉంటాడు  రోహిత్ శర్మ.


 ఇక ఇటీవల టీమిండియాకు దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టి20 ఫార్మాట్లో వరల్డ్ కప్ టైటిల్ ని కూడా అందించాడు అన్న విషయం తెలిసిందే. దీంతో భారత క్రికెట్ హిస్టరీలో ప్రపంచ కప్ గెలిపించిన కెప్టెన్ లో ఒకటిగా చేరిపోయాడు రోహిత్ శర్మ. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్లో మరోసారి జట్టును కెప్టెన్గా ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. కాగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అమెరికాలో పర్యటిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల డల్లాస్ వేదికగా జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నాడు.


 ఈ క్రమంలోనే ఈవెంట్లో రోహిత్ శర్మ ఏకంగా తెలుగులో మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. డల్లాస్ లో జరిగిన ఈవెంట్ లో రోహిత్ శర్మ స్టేజ్ పై నిలబడి మాట్లాడుతూ ఉండగా.. అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఎలా ఉన్నారు అని తెలుగులో అడిగాడు. అయితే అతని మాటలు విని రోహిత్ శర్మ ఎట్లా ఉన్నారు అంటూ నవ్వుతూ బదులు ఇచ్చాడు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే వరల్డ్ కప్ సమయంలో కూడా రోహిత్ శర్మ పలుమార్లు తెలుగులో మాట్లాడారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: