ఇటీవల టీం ఇండియా మాజీ ప్లేయర్లు అందరూ కూడా ఒక గొప్ప విజయాన్ని సాధించారు అన్న విషయం తెలిసిందే. వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో ఏకంగా చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ ను ఓడించి ఇక టైటిల్ విజేతగా నిలిచింది భారత జట్టు. ఈ క్రమంలోనే భారత మాజీ ఆటగాళ్లందరూ కూడా మరోసారి తమ ఆట తీరుతో ఆకట్టుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే భారత ప్లేయర్లపై ప్రస్తుతం అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సాధారణంగా ఫైనల్లో విజయం సాధిస్తేనే అందరూ ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటారు. ఇక తమకు నచ్చిన విధంగా సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు.


 అలాంటిది చిరకాల ప్రత్యర్థి అయిన పాకిస్తాన్ పై ఇలాంటి అద్భుతమైన విజయాన్ని సాధిస్తే.. ఆనందం మాటల్లో వర్ణించలేని విధంగా ఉంటుంది. ఈ క్రమంలోనె టీమిండియా ఆటగాళ్లు వినూత్నమైన రీతిలో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కానీ ఈ సెలబ్రేషన్స్ ఏకంగా ముగ్గురి పాలిట శాపంగా మారిపోయాయి. ఏకంగా వారిపై విమర్శలు రావడానికి కారణం అయ్యాయ్. ఇక పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదు అయింది అని చెప్పాలి. ఇలా వరల్డ్ లెజెండ్స్ ఛాంపియన్షిప్ ఫైనల్లో గెలిచిన తర్వాత టీమిండియా మాజీ ప్లేయర్లు యువరాజ్ సింగ్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్ లు ఏకంగా అవిటి వాళ్ళ లాగా కుంటుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనిపై అంగవైకల్యం కలిగిన వారిని వారు హేళన చేశారు అంటూ ఢిల్లీలో ఓ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.


 ఇలా చేయడంపై టీమిండియా మాజీ క్రికెటర్లు విమర్శలు ఎదుర్కొంటూ ఉండగా.. ఈ విషయంపై మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. తాము కుంటుతూ విడుదల చేసిన వీడియోపై విమర్శలు రావడంతో హర్భజన్ క్షమాపణలు చెప్పాడు. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు 15 రోజులు నాన్ స్టాప్ క్రికెట్ తర్వాత తమ శరీరాలు అలా తయారయ్యాయని.. ఫన్నీగా చెప్పే ఉద్దేశంతోనే అలా చేసాం అంటూ హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. ఇది ఫన్నీ విషయం కాదని పారా బ్యాడ్మింటన్ స్టార్ మానసి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: