వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించిన రోహిత్ సేన వరల్డ్ కప్ టైటిల్ గెల్చుకోగలిగింది. ఈ క్రమంలోనే 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అయితే ఇక ఈ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత షార్ట్ గ్యాప్ లో అటు యంగ్ టీమిండియా కూడా అదరగొట్టింది. కెప్టెన్సీలో జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియా  సిరీస్ లో భాగంగా 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే మరికొన్ని రోజుల్లో అటు శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది టీమిండియా.


 కాగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి సీనియర్ ప్లేయర్లు అటు టి20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగునున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీ లోనే టీమ్ ఇండియా బరిలోకి దిగపోతుంది అని చెప్పాలి. ఆల్రెడీ పొట్టి ప్రపంచ కప్ గెలిచిన భారత్ ముందు భవిష్యత్తులో భారీ లక్ష్యాలు ఉన్నాయి. వన్డే ఫార్మాట్లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీతో పాటు టెస్ట్ లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్రోఫీని కూడా గెలుచుకోవాల్సి ఉంది. ప్రతి ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ఫైనల్ వరకు వెళ్లిన రోహిత్ సేన చివరి అడుగులో తడబడి రన్నరప్ తో సరిపెట్టుకుంది.


 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లోను రెండుసార్లు ఓడిపోయి ట్రోఫీని చేజార్చుకుంది అని చెప్పాలి. అయితే ఈ రెండు ఫార్మాట్లలో ఇప్పుడు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు. కాబట్టి రెండు లక్ష్యాలు అందుకోవాలి అని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పటినుంచి టీం కాంబినేషన్ సెట్ చేసుకుంటే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారత మాజీ బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కెప్టెన్ రోహిత్ కి ఒక సూచన చేశాడు. రింకు సింగ్ లాంటి మోస్ట్ టాలెంటెడ్ ప్లేయర్ ను టెస్టుల్లో ఆడించాలి అంటూ సూచించాడు. అతని టెస్ట్ జట్టులోకి తీసుకుంటే టీమిండియా కు తిరుగు ఉండదు అంటూ అభిప్రాయపడ్డాడు. అతనిలో అపారమైన ప్రతిభ దాగి ఉందని.. నెట్స్ లో బ్యాటింగ్ చేసే టైంలో చూస్తే టెక్నికల్ గా ఏ మాత్రం తప్పులు కనిపించలేదు. ఇంత సాలిడ్ బ్యాటర్ను టెస్టుల్లోకి తీసుకుంటే తప్పేంటి అంటూ ఇక విక్రమ్ రాథోడ్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: