అంతర్జాతీయ క్రికెట్ లోకి టి20 ఫార్మాట్ ను ప్రవేశపెట్టినపుడు అప్పుడెప్పుడో జరిగిన 2007 ప్రపంచ కప్ ను టీమిండియా గెలుచుకుంది. ధోని కెప్టెన్సీలో ఇలా వరల్డ్ కప్ ను ముద్దాడింది అన్న విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత పొట్టి ఫార్మాట్లో వరల్డ్ కప్ ట్రోఫీ గెలవడం టీమ్ ఇండియాకు అందని ద్రాక్ష లాగే మారిపోయింది. మొదటిసారి ప్రపంచకప్ గెలిచిన ధోని సైతం ఆ తర్వాత ఇక ఈ వరల్డ్ కప్ టోర్నీని గెలిపించలేకపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీ చేపట్టిన టీమిండియాకు కప్పు కొట్టాలని కల మాత్రం తీరలేదు అని చెప్పాలి.


 అయితే రోహిత్ శర్మ మాత్రం 140 కోట్ల భారతీయుల కలను నెరవేర్చాడు. ఇటీవల వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ తన కెప్టెన్సీ తో మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. ఒక ఓటమి కూడా లేకుండా టీమిండియాను ముందుకు నడిపించడంలో సక్సెస్ అయిన రోహిత్ శర్మ అటు టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో కూడా భారత జట్టును గెలిపించి.. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణ తర్వాత టీమ్ ఇండియాకు పొట్టి ఫార్మాట్లో వరల్డ్ కప్ టైటిల్ అందించాడు అని చెప్పాలి. దీంతో ఇదే శుభ సందర్భాన తను అంతర్జాతీయ టి20 కెరియర్ కు కూడా రిటర్మెంట్ ప్రకటించాడు కెప్టెన్ రోహిత్ శర్మ.


 ఈ క్రమంలోనే ఇలా ఒక్క ఓటమి కూడా లేకుండా టీమిండియా ఘనవిజయాన్ని సాధించడంతో.. అందరూ ప్రశంసలు కురిపించారు. కాగా ఇక టి20 వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో తన భావోద్వేగాలు ఎలా ఉన్నాయి అనే విషయం గురించి రోహిత్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో కీలకమైన చివరి 5 ఓవర్లలో పడిన టెన్షన్ గురించి రోహిత్ తెలిపాడు. 15 ఓవర్లలో క్లాసేన్ దంచి కొట్టడంతో అంతా మారిపోయింది. సౌత్ ఆఫ్రికా 30 బంతుల్లో 30 పరుగులు చేయాలి. నా మైండ్ పూర్తిగా బ్లాక్ అయింది. ఎక్కువ ఆలోచించలేదు. ఆ క్షణంలో ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టా. భయపడలేదు మేమంతా ఎంతో ప్రశాంతంగా ఉన్నాం. ఆ సమయంలో మా జట్టు ప్రవర్తించిన తీరు ఎంతో బాగుంది అంటూ రోహిత్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: