నేటి రోజుల్లో క్రికెట్ కి ఉన్న ఆదరణ రోజు రోజుకు పెరిగిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా ప్రపంచ దేశాలకు క్రికెట్ క్రేజ్ పెరిగిపోతున్న నేపథ్యంలో.. అన్ని దేశాలలో కూడా ఏకంగా క్రికెట్ జట్లు తయారవుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్లు వస్తున్నాయి అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా టీవీలకు అతుక్కుపోయి మరి మ్యాచ్లు వీక్షిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. సాధారణంగా క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తూ పిలుస్తూ ఉంటారు. అయితే క్రికెట్ లో ఎప్పుడూ కూడా ఆటగాళ్లు మాత్రమే కాదు అటు చూస్తున్న ప్రేక్షకులు కూడా ఉత్కంఠను ఎంజాయ్ చేస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే.


 ఏ బంతికి ఎప్పుడు మ్యాచ్ స్వరూప మారిపోతుందో తెలియదు. కాబట్టి ఇక ప్రతి బంతిని కూడా మిస్ చేయకుండా కల్లార్పకుండా  చూసేయడం చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఉత్కంఠ భరితంగా సాగే క్రికెట్ మ్యాచ్లలో కూడా.. కొన్ని కొన్ని సార్లు ఫన్నీ ఘటనలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు ఏదైనా జరిగింది అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటనే జరిగింది. ఏకంగా ఒక బ్యాటర్ ఊహించని రీతిలో వికెట్ కోల్పోయాడు. అయితే అతను వికెట్ కోల్పోయిన విధానం చూసి.. సదరు బ్యాటర్ సైతం షాక్ లో మునిగిపోయాడు అని చెప్పాలి.


 టి20 లాస్ట్ లీగ్ లో ఈ ఘటన జరిగింది. గ్లామర్గాన్ జట్టు ఆటగాడు మర్నస్ లబుషేన్  విచిత్రమైన రీతిలో అవుట్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బ్లూసిస్టర్ షైర్ బౌలర్ టైలర్ విసిరిన బంతిని లబుషేన్ షాట్ ఆడాడు. అయితే అది గాల్లో నేరుగా వెళ్లి నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న బ్యాటర్ కాలికి తగిలి ఏకంగా బౌలర్ చేతిలో పడింది. దీంతో అక్కడ జరిగిన పరిణామంతో ఒకసారిగా షాక్ లో మునిగిపోయిన లభిషేన్ ఏకంగా వికెట్ కోల్పోయి నిరాశతో మైదానాన్ని వీడాడు అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: