బీసీసీఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి ఎంత గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఐపీఎల్ లో ఛాంపియన్ టీం ఏది అంటే ముంబై ఇండియన్స్ అని చెప్పేస్తుంటారు భారత క్రికెట్ ప్రేక్షకులు. అయితే ఇక అచ్చం ఐపీఎల్ మాదిరిగానే ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా ప్రస్తుతం టి20 లీగ్లను నిర్వహిస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఐపీఎల్ లోని ఫ్రాంచైజీలే ఇతర టీ20 లీగ్లలో కూడా జట్లను కొనుగోలు చేసి అక్కడ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నాయి.


 అచ్చం ఇలాగే సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా సౌత్ ఆఫ్రికా t20 లీగ్ అనే ఒక పొట్టి ఫార్మాట్ టోర్ని  నిర్వహిస్తూ ఉంటుంది. అయితే ఇక ఈ టోర్నమెంట్లో అటు ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఒక టీం గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా ముంబై ఇండియన్స్ జట్టులోకి ఒక కొత్త ఆటగాడు వచ్చి చేరాడు. ముంబై ఇండియన్స్ అనగానే ఐపిఎల్ అనుకునేరు. ఏకంగా సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ఆడుతున్న ముంబై ఇండియన్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చి చేరాడు. అతను ఎవరో కాదు గతంలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన బెన్ స్టోక్స్ కావడం గమనార్హం.

 ఈ క్రమంలోనే సౌత్ ఆఫ్రికా t20 లీగ్ లో ఏకంగా ముంబై ఇండియన్స్ కేప్ టౌన్ జట్టు తరఫున ఆయన బరులోకి దిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. 8.5 కోట్లు వెచ్చించి.. అతడిని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇంగ్లాండు వెటరన్ ప్లేయర్ రూట్ కూడా పార్ల్ రాయల్స్ తరఫున అటు సౌత్ ఆఫ్రికా t20 లీగ్ 2025 టోర్నీలో ఆడబోతున్నట్లు సమాచారం. కాగా బెన్ స్టోక్స్ ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాల్సి ఉన్నప్పటికీ.. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: