సాధారణంగా అత్యుత్తమ ఫామ్ లో ఉన్న ఆటగాడినే జట్టులోకి సెలక్ట్ చేయడానికి భారత సెలక్టర్లు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా జట్టు ఎంపిక సమయంలో వారి గత ప్రదర్శనలను పరిగణలోకి తీసుకోవడం చేస్తూ ఉంటారు. ఈక్రమంలోనే కొన్ని కొన్ని సార్లు ఇక జట్టులోకి ఎంపిక చేసిన ఆటగాళ్ల విషయంలో టీమిండియా అభిమానులకు పెద్దగా ఆశ్చర్యం అనిపించదు. కానీ కొన్ని కొన్ని సార్లు మాత్రం ఏకంగా ఎవరు ఊహించని విధంగా జట్టులోకి ఆటగాళ్లను ఎంపిక చేయడం చేస్తూ ఉంటారూ సెలెక్టర్లు. ఇక ఇప్పుడు శ్రీలంక పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో కూడా ఇలాగే కొంతమంది ఆటగాళ్ళకు ఛాన్సులు కల్పించారు అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న జింబాబ్వే పర్యటనలో ఛాన్స్ దక్కించుకున్న అభిషేక్ శర్మ రుతురాజ్ గైక్వాడ్ లు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అటు టీమిండియా జింబాబ్వే పై 4-1 తేడాతో ఆధిపత్యం చెలాయించి సిరీస్ ను చేజిక్కించుకుంది అంటే ఈ ఇద్దరు ప్లేయర్ల ప్రదర్శన ఎంతో కీలకంగా మారిపోయింది. దీంతో వారికి తర్వాత జరగబోయే సిరీస్ లలో కూడా తప్పకుండా చోటు తగ్గుతుంది అని అందరూ భావించారు. కానీ ఊహించని రీతిలో శ్రీలంక పర్యటన కోసం వెళ్లే టీమిండియాలో ఈ ఇద్దరు ప్లేయర్లను పక్కన పెట్టేసారు సెలెక్టర్లు. దీంతో అందరూ ఆశ్చర్యం లో మునిగిపోయారు అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే జింబాబ్వే పర్యటనలో అంతగా ఆకట్టుకోలేక పోయిన రియాన్ పరాగ్ కు మాత్రం శ్రీలంకతో జరగబోయే వన్డే, టి20 సిరీస్ లకు ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే సత్తా చాటిన రుతురాజ్ అభిషేక్ లను వదిలేసి రియాన్ పరాగ్ ను ఎందుకు సెలెక్ట్ చేశారు అనే విషయంపై కూడా బిసిసిఐ సెలెక్టర్లపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ఐపీఎల్లో బాగా రాణించడం ఆ తర్వాత జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా అదరగొట్టడంతోనే అతనికి జట్టులో చోటు కల్పించారు. మరోవైపు రంజీ ట్రోఫీలో కూడా పరాగ్ నిలకడగా రాణిస్తున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: