2024 సంవత్సరం టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కు... అసలు కలిసి రానట్లు కనిపిస్తోంది. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి హార్దిక్ పాండ్యాను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ముంబై జట్టులో ట్రోలింగ్, ఆ తర్వాత విడాకులు, కెప్టెన్సీ పోవడం.. ఇలా ఒకటి ఏంటి... హార్దిక్ పాండ్యా లైఫ్ లో అన్ని కష్టాలే వస్తున్నాయి. దీంతో హార్దిక్ పాండ్యా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


అసలు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో హార్దిక్ పాండ్యా... ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో... హార్దిక్ పాండ్యా కుటుంబం పై... అంబానీ ఫ్యామిలీ దెబ్బకొట్టింది. మొన్నటి వరకు హార్దిక్ పాండ్యాను నెత్తిన పెట్టుకున్న ముంబై ఇండియన్స్ ఓనర్ అంబానీ...ఇప్పుడు అతన్ని...తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అతి త్వరలోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి.. హార్దిక్ పాండ్యాను తొలగించాలని... అంబానీ కుటుంబం ఓ నిర్ణయానికి వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.


వచ్చే సీజన్లోపు ఈ నిర్ణయం తీసుకోనున్నారట. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో.... ముంబై ఇండియన్స్ అత్యంత దారుణంగా  విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యా పై దారుణంగా ట్రోలింగ్ వచ్చింది.అయినప్పటికీ అంబానీ మాత్రం... హార్థిక్ పాండ్యా పై ఫుల్  నమ్మకంతో ఉన్నారు.కానీ తాజాగా... టి20 కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యాను తొలగించడంతో...ఇటు అంబానీ కూడా... ముంబై కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్య ను తీసేయాలని అనుకుంటున్నారట.


హార్దిక్ పాండ్యా స్థానంలో మళ్లీ రోహిత్ శర్మకు లేదా బుమ్రా .. లేదా సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ ఇవ్వాలని... అనుకుంటున్నారట.  ఒకవేళ ఇదే నిజమైతే... హార్దిక్ పాండ్యాకు మరో దెబ్బ తగిలినట్లే. కాగా రెండు రోజుల కిందట.. తన భార్య నటాషాకు... హార్దిక్ పాండ్యా విడాకులు ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన చేశారు హార్దిక్ పాండ్యా. దీంతో ఫ్యాన్స్ అంతా నిరాశ కు గురయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: