టీమిండియాలో కీలక ప్లేయర్గా రోహిత్ శర్మ కెప్టెన్ గా టీం ఇండియాని ఎంత సక్సెస్ఫుల్గా ముందుకు నడిపిస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విరాట్ కోహ్లీ నుంచి సారధ్య బాధ్యతలు అందుకున్న రోహిత్ ప్రస్తుతం మూడు ఫార్మట్లకు కూడా కెప్టెన్ గా కొనసాగుతూ వున్నాడు అని చెప్పాలి. ఇక అతను సారధిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి టీమిండియా సక్సెస్ రేట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే ఆటగాళ్లకు పూర్తిగా స్వేచ్ఛనిస్తూ..  తనదైన వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తూ ఇక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ.


 అయితే అప్పటికే ఐపీఎల్ లో ఏకంగా ముంబై ఇండియన్స్ కి ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్గా గుర్తింపును సంపాదించుకున్న రోహిత్ శర్మ.. అటు టీమిండియా కెప్టెన్ గా మారిన తర్వాత కూడా అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ను అందిస్తాడని అందరూ అనుకున్నారు. అనుకున్నట్లుగానే ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియాకు ఇక వరల్డ్ కప్ ట్రోఫీని అందించి 17 ఏళ్ల నిరీక్షణకు తెరదింపాడు రోహిత్ శర్మ. దీంతో అతని కెప్టెన్సీ పై అందరూ ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. వరల్డ్ కప్ ఫైనల్ లాంటి కీలక మ్యాచ్ లలో ఎవరైనా బౌలర్ భారీగా పరుగులు సమర్పించుకుంటే.. కెప్టెన్ గా ఉన్న ఆటగాడు ఇక పరుగులు ఇస్తున్న బౌలర్ ఫై చిరాకు పడటం చూస్తూ ఉంటాం.



 అయితే రోహిత్ మాత్రం తనపై అలా చిరాకు పడలేదు అంటూ చెప్పుకొచ్చాడు ఆల్రౌండర్ అక్షర్ పటేల్. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అక్షర పటేల్ బౌలింగ్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్ క్లాసేన్  ఎంత విధ్వంసం సృష్టించాడో భారత క్రికెట్ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. అతని విధ్వంసంతో మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఇలా పరుగులు ఇచ్చిన సమయంలో కూడా కెప్టెన్ రోహిత్ తనకు మద్దతుగా నిలిచాడని.. అక్షర పటేల్ చెప్పుకొచ్చాడు. ఓవర్ మధ్యలో రోహిత్ నా దగ్గరికి వచ్చి బ్యాట్స్మెన్ బాగా ఆడుతుంటే.. నీ తప్పు కాదు తర్వాత బంతి గురించి ఆలోచించు అంటూ చెప్పాడు. ఓవర్ అయిపోయిన తర్వాత కూడా బాగానే వేశావు టెన్షన్ పడకు అంటూ నా భుజం తట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు అక్షర్ పటేల్.

మరింత సమాచారం తెలుసుకోండి: