అయితే ఇటీవల వెస్టిండీస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ టోర్నీలో మంచి ప్రదర్శన చేసినప్పటికీ మరోసారి విడాకుల వార్తలతో హాట్ టాపిక్ గా మారిపోయాడు. తన భార్య నటాషా తో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకుంటున్నట్లు ఎన్నో రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చికార్లు చేశాయి. అయితే ఇటీవల ఈ విషయంపై క్లారిటీ వచ్చింది. ఇలా సోషల్ మీడియాలో తన భార్యతో హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోబోతున్నాడు అంటూ వచ్చిన వార్తలు నిజమే అన్న విషయం స్పష్టమైనది. ఏకంగా తాము విడాకులు తీసుకుని విడిపోతున్నాము అన్న విషయాన్ని ఇద్దరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ద్వారా తెలియజేశారు.
అయితే విడాకుల తర్వాత హార్దిక్ భార్య నటాషా తన కొడుకు అగస్త్యతో కలిసి సెర్బియా వెళ్లేందుకు సిద్ధమైంది. దీంతో తండ్రిని బిడ్డ లేక అటు హార్దిక్ కొడుకు అగస్త్య కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆ పిల్లాడిని చూస్తే నటాషా బలవంతంగా అతన్ని సెర్బియాకు తీసుకెళ్లినట్లు అనిపిస్తుంది అంటూ ఎంతో మంది నెటిజెన్స్ ఈ వీడియో చూసి కామెంట్లు చేస్తున్నారు. గతంలో శిఖర్ ధావన్ మాజీ భార్య కూడా ఇలాగే అతని కొడుకుని ఆస్ట్రేలియాకు తీసుకువెళ్లిందని ఆ సమయంలో ధావన్ చూస్తే జాలేసిందని.. ఇక ఇప్పుడు అగస్త్యను చూసినా కూడా అలాగే అనిపిస్తుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.