మహేంద్ర సింగ్ ధోని ఈ సీజన్లో ఆడే అవకాశాలు.. లేకపోవడంతో... ధోని స్థానంలో మంచి వికెట్ కీపర్ ను తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఢిల్లీ క్యాపిటల్స్... రిషబ్ పంత్ పై ఫోకస్ పెట్టింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. వచ్చే సీజన్లోపు అతన్ని... ఎంత ధర కైనా కొనుగోలు చేసేందుకు... ప్రయత్నాలు చేస్తోందట చెన్నై సూపర్ కింగ్స్. అటు రిషబ్ పంత్ కూడా... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు... గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంతును టార్గెట్ చేసిందట చెన్నై సూపర్ కింగ్స్. అన్ని ఓకే అయితే రిషబ్ పంత్ ను రిటైర్డ్ ప్రక్రియ లేదా కొనుగోలు ద్వారా కొనే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రిషబ్ పంత్ జట్టులోకి వస్తే... మహేంద్ర సింగ్ ధోని స్థానాన్ని భర్తీ చేయవచ్చు. అలాగే బ్యాటింగ్ లోను... పంత్ అదరగొడతాడు.
రిషబ్ పంత్తే కాకుండా... లక్నో జట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ కూడా... తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాడని వార్తలు వస్తున్నాయి. అతడు బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు కెప్టెన్ అవుతాడని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే దీనిపై.. చర్చలు కూడా ప్రారంభమయ్యాయట. అతి త్వరలోనే కేఎల్ రాహుల్.. లక్నో జట్టును బదిలీ... బెంగళూరు జట్టులోకి వెళ్లే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. మెగా వేలం వరకు మరిన్ని మార్పులు కూడా ఈ టోర్నమెంట్లో జరగనున్నాయి.