ఇండియన్ ప్రీమియర్ లీగ్.. ఇది ఒక సాధారణ టి20 లీగ్ అయినప్పటికీ ఏకంగా వరల్డ్ కప్ కంటే కాస్త ఎక్కువగానే క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఐపీఎల్ ను ప్రతి ఏడాది మిస్ చేయకుండా చూడటానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఎందుకంటే తమ అభిమాన ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో భాగం అవుతూ ఉంటారు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యేకంగా ఉన్న ఆటగాళ్లు ఐపిఎల్ లో సహచరులుగా మారిపోయి జట్టు విజయం కోసం పోరాడుతున్న తీరు అందరిని ఆకర్షిస్తూ ఉంటుంది.


 అయితే ఇక ఐపీఎల్ లో మెగా వేలం జరిగినప్పుడల్లా ఎవరు ఏ జట్టులోకి వెళ్లబోతారు అనే విషయంపై ప్రేక్షకులు అందరిలో కూడా ఉత్కంఠ ఉంటుంది అని చెప్పాలి. కాగా 2025 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి మెగా వేలం జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ ఆటగాడు ఏ టీంలోకి వెళ్ళబోతున్నాడు అనే విషయంపై ఉత్కంఠ ఉంది. ఇలాంటి సమయంలో ఏకంగా కొన్ని టీమ్స్ తమ కెప్టెన్లను సైతం వదులుకునేందుకు సిద్ధమయ్యాయి అంటూ కొన్ని వార్తలు తెర మీదకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇప్పటికే ఢిల్లీ క్యాపిటల్స్ ఏకంగా రిషబ్ పంతును వేలంలోకి వదిలేసి మళ్లీ కొనుగోలు చేయడానికి సిద్ధమైన అంటూ వార్తలు వచ్చాయి.


 ఇక ఇప్పుడు అటు లక్నో ఫ్రాంచైజీ సైతం ఇలాంటి నిర్ణయం తీసుకోబోతుందట. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ మెగా వేలంలో జట్టులో కీలక మార్పులు చేయాలని లక్నో అనుకుంటుందట. ఏకంగా కెప్టెన్ కేఎల్ రాహుల్ వదిలేసుకోవాలని అనుకుంటుందట. అటు రాహుల్ కూడా జట్టును వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతడు తిరిగి బెంగళూరు టీం లోకి వెళ్లాలి అనుకుంటున్నాడట. పైగా బెంగళూరు టీం లో అతనికి కెప్టెన్సీ ఆఫర్ కూడా వచ్చిందట.  దీంతో ఆర్సిబి జట్టుకు త్వరలో కొత్త కెప్టెన్ రాబోతున్నాడు అంటూ ఒక టాక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రాబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: