టీమ్ ఇండియాలో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా కేవలం క్రికెట్ కెరియర్ మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కూడా అయోమయంలో పడిపోయింది అని తెలుస్తుంది. ఎందుకంటే స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న హార్దిక్ పాండ్యా.. టీమ్ ఇండియా ఫ్యూచర్ కెప్టెన్ అని అందరు అనుకున్నారు. రోహిత్ శర్మ రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత అతనీ చేతికి కెప్టెన్సీ బాధ్యతలు వస్తాయని అందరు భావించారు. అయితే ఇటీవల వరల్డ్ కప్ గెలిచిన వెంటనే రోహిత్ రిటర్మెంట్ ప్రకటించిన నేపద్యంలో.. టీమిండియా కు త్వరలో కాబోయే కొత్త t20 కెప్టెన్ హార్దిక్ పాండ్యనే అందరూ బలంగా నమ్మారు.


 కానీ ఊహించని రీతిలో హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ఏకంగా హార్దిక్ ను కాదని సూర్య కుమార్ యాదవ్ చేతికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కనీసం హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ హోదాలో కూడా పెట్టకుండా ఒక సాదాసీదా ఆటగాడు గానే జట్టులోకి ఎంపిక చేసింది. దీంతో హార్దిక్ పాండ్యాకు అన్యాయం జరిగిందంటూ అందరూ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఇక హార్దిక్ తన భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించాడు  దీంతో ఇలా విడాకుల ద్వారా కెరియర్ పరంగా మాత్రమే కాకుండా పర్సనల్ గా కూడా ఎంతగానో సఫర్ అయిపోతున్నాడు హార్థిక్ పాండ్యా.


 అయితే భార్య నటాషా తో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత మొదటిసారి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు.  ఇది కాస్త వైరల్ గా మారింది. మన శరీరం అలసిపోయినప్పుడు మెదడు అలసిపోతుంది. అలా జరిగినప్పుడు నన్ను పుష్ చేయమని నా శరీరానికి చెబుతాను. అలాంటప్పుడే ఎప్పటికప్పుడు అత్యుత్తమంగా ఉండేందుకు వీలవుతుంది అంటూ హార్దిక్ పాండ్యా ఒక పోస్ట్ పెట్టాడు. అయితే ఇది ఒక ఫిట్నెస్ బ్రాండ్ ప్రచారంలో భాగంగా చేసిన వీడియోనే అన్నది అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: