సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్లేయర్లు ఏ వయసులో రిటైర్మెంట్ ప్రకటిస్తే బాగుంటుంది అనే విషయంపై ఇప్పటికి ప్రేక్షకులకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే ఒక్కో ఆటగాడు ఒక్కో వయసులో రిటైర్మెంట్ ప్రకటించడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది ఆటగాళ్లు నలభై ఏళ్ల వయసు దాటిపోతున్న ఇంకా రిటైర్మెంట్ ఆలోచన చేయరు. తమలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉందని.. దేశం కోసం ఆడటానికి ఇష్టపడుతూ ఉంటాను అంటూ చెబుతూ ఉంటారు. ఇంకొంద మంది ప్లేయర్లు మాత్రం ఇక 30 ప్లస్ వయసు వచ్చిందంటే చాలు ఏకంగా తమ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధమవుతూ ఉంటారు అని చెప్పాలి.


 అయితే ఇండియాలో మాత్రం 39 నుంచి 45 ఏళ్ల వయసులో చాలామంది క్రికెటర్లు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించడం చేస్తూ ఉంటారు. కొంతమంది అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కొ రిటైర్మెంట్ ప్రకటించిన ఇక అటు ఐపిఎల్ లాంటి టోర్నీలలో మాత్రం కొనసాగుతూ ఉంటారు. మొన్నటికి మొన్న టి20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. కానీ వన్డేలు టెస్టులలో మాత్రం కొనసాగుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఏ వయసులో రిటైర్మెంట్ ప్రకటించాలి అనే విషయంపై మిస్టర్ కూల్ ధోని ఏమనుకుంటున్నాడు అన్న విషయం తెలుసుకోవడానికి అందరూ ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.


 అయితే ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో భారత ఫేసర్ మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. ధోని రిటైర్మెంట్ స్ట్రాటజీ ఏంటి అన్న విషయాన్ని తెలిపాడు. రిటైర్మెంట్ గురించి ఓసారి నేను ధోనితో మాట్లాడాను. ఒక ఆటగాడు ఎప్పుడు రిటైర్ అవ్వాలి అని ధోనిని అడిగితే.. మొదట మీరు ఆటపై విసుగు చెందినప్పుడు.. రెండోది జట్టు మిమ్మల్ని తొలగిస్తున్నారని తెలిసినప్పుడు అంటూ సమాధానం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోని అంటూ మహమ్మద్ షమీ చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అదరగొట్టిన ధోని వచ్చే ఐపీఎల్ సీజన్ నాటినుండి ఇక డొమెస్టిక్ క్రికెట్ కెరియర్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటించి చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ గా కొనసాగే అవకాశం ఉంది అన్నది తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: