ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ల హవా ఎంతల పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది సినీ క్రీడా రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల జీవిత కథలను ఆధారంగా చేసుకుని దర్శకులు నిర్మాతలు ఇలా బయోపిక్ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇలా బయోపిక్ సినిమాల ద్వారా ఎవరికీ తెలియని ఎన్నో సీక్రెట్ లను కూడా తెలియజేస్తున్నారు అని చెప్పాలి.  ఎలాంటి సినిమాలు సూపర్ హిట్లు అవుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు ఇలా ఎంతో మంది ప్రముఖుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించాయి.


 ఇక రానున్న రోజుల్లో మరి కొంతమంది బయోపిక్ లు కూడా తెరకెక్కి అవకాశం ఉంది అంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే టీమిండియాలో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న రోహిత్ శర్మ విరాట్ కోహ్లీల బయోపిక్ లు కూడా త్వరలో జరిగే ఛాన్స్ ఉంది అంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఒకవేళ నిజంగానే వీరి జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కితే ఇక ఆయా క్రికెటర్ల పాత్రల్లో ఏ హీరో నటిస్తే బాగుంటుంది అనే విషయంపై కూడా ఎప్పుడూ చర్చ జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ ఇటీవల భారత జట్టుకు వరల్డ్ కప్ టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే ఒకవేళ అతని బయోపిక్ తెరకెక్కిస్తే ఎవరు హీరోగా నటిస్తే బాగుంటుంది అనే విషయంపై చర్చ జరుగుతుంది.


 కాగా రోహిత్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తే బాగుంటుందని అందరూ అభిప్రాయపడుతున్నారు. 2011 వన్డే వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయిన రోహిత్ శర్మ.. ఇక 2013లో ఓపెనర్ అవతారం ఎత్తిన తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అంతే కాకుండా ఎంతో అలవోకగా సిక్సర్లు కొడుతూ డబుల్ సెంచరీలు బాదుతూ హిట్ మ్యాన్ అని అనిపించుకున్నాడు. ఒకవేళ రోహిత్ శర్మ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కిస్తే.. అటు గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ లేదంటే యంగ్ హీరో శర్వానంద్ లలో ఎవరో ఒకరు సెట్ అవుతారని అభిప్రాయపడుతున్నారు టాలీవుడ్ సినీ ప్రేక్షకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: