ఇండియాలో క్రికెట్ కి ఉన్న ఆదరణ మరే క్రీడకీ లేదనే చెప్పుకోవాలి. అందుకే ఇక్కడ క్రికెటర్లను సినిమా హీరోలకంటే ఎక్కువగా ఇష్టపడతారు. ఎంతోమంది తమ అభిమాన ఆటగాళ్ల టాటూలను తమ శరీరాలపై వేసుకొని సంతృప్తి చెందుతూ ఉంటారు. ఇక సదరు ఆటగాడు సెంచరీ చేస్తే ఇక అభిమానుల ఆనందాలకు అవధులే ఉండవు. భార‌త మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అభిమాని సుధీర్ కుమార్ గురించి మీకు తెలిసే ఉంటుంది. అతగాడి తన ఒంటినిండా రంగులు వేసుకొని మరీ సచిన్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు సందడి చేసేవాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అటువంటివారు ఎంతో మంది అభిమానులున్నారు. అది మాత్రమే కాకుండా అభిమాన క్రికెటర్లు ఏదన్నా సాధిస్తే తాము సాధించినంత ఆనందపడతారు అభిమానులు.

ఇక అదే అభిమానులు తమ అభిమాన క్రికెటర్లు సొంత విమానాలు కలిగిఉంటే ఎంత ఆనంద పడతారో చెప్పనవసరం లేదు. వాళ్లే సొంతగా గాల్లో ఎగిరినంత ఆనంద పడతారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలా క్రికెట్ లో సొంత ప్రైవేట్ జెట్ లను క‌లిగి ఉన్న ఆట‌గాళ్ల‌లో లెజెండ‌రీ ప్లేయ‌ర్ సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ తో పాటు కొంతమంది యంగ్ ప్లేయ‌ర్లు కూడా ఉన్నారనే విషయం మీకు తెలుసా? ఇపుడు వారి వివరాలు చూద్దాము.

ఈ లిస్టులో మొదటి వాడు, ఇండియన్ క్రికెట్ ఆల్ రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా. అవును, భారత జాతీయ క్రికెట్ జ‌ట్టులో కీల‌క ప్లేయ‌ర్ గా చెలామణీ అవుతున్న హార్దిక్ వివిధ టోర్న‌మెంట్లు, చాలా సంస్థ‌ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా ఉంటూ భారీగానే డ‌బ్బును సంపాదిస్తున్నాడు. హార్దిక్ పాండ్యాకు ఓ ప్రైవేట్ జెట్ ను కలిగి వున్నాడు. ఇక ర‌న్ మిష‌న్ విరాట్ కోహ్లి గురించి చెప్పాల్సిన పనిలేదు.. మనోడికి లగ్జరీ కార్లన్నా, గాడ్జెట్స్ అన్నా ఎంతో ఇష్టం. మనోడికి కూడా సొంతంగా ఒక ప్రైవేట్ జెట్ ఉంది. ఇక క్రికెట్ 3 ఫార్మాట్ల‌లో భార‌త జ‌ట్టును ఛాంపియ‌న్ గా నిల‌బెట్టిన కెప్టెన్ ఎంఎస్ ధోనికి కూడా ఒక‌ ప్రైవేట్ జెట్ కలిగి ఉన్నాడు. అదేవిధంగా క్రికెట్ చరిత్రలో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకరు అయినటువంటి టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ కి కూడా ఒక ప్రైవేట్ జెట్ ఉందన్న విషయం చాలామందికి తెలియదు. ఇక "గాడ్ ఆఫ్ క్రికెట్" గా గుర్తింపు సాధించిన మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక ప్రైవేట్ జెట్ ను క‌లిగి ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: