టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియడంతో ఇక ఇప్పుడు భారత జట్టుకు కొత్త ప్రధాన కోచ్ ను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈ పదవి ఎవరికి దక్కుతుందా అనే చర్చ జరుగుతున్న సమయంలో.. టీమిండియా మాజీ ప్లేయర్ గౌతమ్ గంభీర్ కి ప్రధాన కోచ్ పదవిని బీసీసీఐ కట్టబెట్టింది అన్న విషయం తెలిసిందే. అయితే కోచ్ ఎంపిక అయితే పూర్తయింది. కానీ ఆయనకు అసిస్టెంట్ల ఎంపిక మాత్రం ఇప్పటివరకు పూర్తి కాలేదు. అయితే తన సిబ్బంది ఎంపిక విషయంలో పూర్తిగా తనకు స్వేచ్ఛని ఇవ్వాలంటూ గౌతమ్ గంభీర్ అటు బీసీసీఐ పెద్దలను డిమాండ్ చేశాడు.


 ఇక అందుకు అటు బీసీసీఐ కూడా అంగీకరించింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తన కోచింగ్ సిబ్బందిలోకి ఎవరిని తీసుకోవాలి అనే విషయంపై ప్రస్తుతం గౌతమ్ గంభీర్ కసరత్తు  చేస్తున్నాడు. కాగా ఎక్కువ శాతం అటు స్వదేశీ ఆటగాళ్లకు పెద్ద పీట వేసేందుకు తమ సిద్ధంగా ఉన్నామని బీసీసీఐ పెద్దలు ఇప్పటికే గౌతమ్ గంభీర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఇక అతని అసిస్టెంట్ కోచ్ ల లిస్టులో ఎవరి పేరు చేయబోతుంది అనే విషయంపై గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. కాగా టీమిండియా బౌలింగ్ కోచ్గా కోల్కతా జట్టు మాజీ ప్లేయర్ రాబోతున్నట్లు ఒక టాక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 టీమిండియా బౌలింగ్ కోచ్ గా మోర్ని మోర్కేల్ ను నియమించేందుకు అటు గౌతమ్ గంభీర్ ప్రతిపాదన పెట్టగా.. ఇందుకు బీసీసీఐ నుంచి కూడా అంగీకారం లభించినట్లు సమాచారం. శ్రీలంకతో జరగబోయే సిరీస్ తర్వాత మోర్ని మోర్కేల్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందట. అయితే బౌలింగ్ కోచ్ కోసం ముందుగా మోర్ని మోర్కిల్ తో పాటు అటు వినయ్ కుమార్, లక్ష్మీ గణపతి పేర్లను కూడా బీసీసీఐకి సూచించగా చివరికి ఇక కోల్కతా మాజీ ఆటగాడినే బౌలింగ్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 2014 ఐపీఎల్ లో గౌతమ్ గంభీర్ కెప్టెన్ కాగా జట్టులో ఆటగాడిగా కొనసాగాడు మోర్కిల్. గంభీర్ లక్నో కి మెంటార్గా వ్యవహరించినపుడు.. మోర్కిల్ ఆటో అదే జట్టుకు బౌలింగ్ కోచ్ గా వ్యవహరించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: