సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన ప్లేయర్లు ఎప్పుడు అద్భుతమైన ప్రదర్శన చేసి ఎన్నో అరుదైన రికార్డులు కొల్లగొట్టాలని అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.  ఈ క్రమంలోనే ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్లో ఎప్పుడు కూడా సెంచరీ సాధించాలనే లక్ష్యంతోనే ప్రతి బ్యాట్స్మెన్ కూడా బరిలోకి దిగడం చూస్తూ ఉంటాం. కానీ ఇలా సెంచరీ సాధించడం అనేది అంత సులభమైన విషయం కాదు. కేవలం కొంతమంది ఆటగాళ్ళకు మాత్రమే ఇది సాధ్యమవుతూ ఉంటుంది అని చెప్పాలి.


 అయితే ఎవరైనా ఆటగాడు ఇలా సెంచరీలు సాధిస్తూ రికార్డు సృష్టించాడు అంటే ఇక అతన్ని క్రికెట్ లెజెండ్ అని అభిమానులు అందరూ కూడా కొనియాడటం  చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఇలాంటి దిగ్గజ క్రికెటర్లు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్లుగా ఎవరు కొనసాగుతున్నారు అన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. కాగా ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో ఉండే వన్డే t20 టెస్ట్ ఫార్మట్ లు కలిపి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు.


 ఏకంగా సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో 100 సెంచరీలు చేసి సెంచరీ కొట్టేసాడు. ఇక ఆ తర్వాత ఎవరికి అందనంత ఎత్తులో యాక్టివ్ క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. మూడు ఫార్మట్ లో కలిపి కోహ్లీ 80 సెంచరీలు చేశాడు. ఇక తర్వాత రికీ పాంటింగ్ 71, కుమార సంగకర 63, జాక్ కలీస్ 62, హసీం ఆమ్లా 55,మహేళ జయవర్ధనే 54, బ్రియాన్ లారా 53, డేవిడ్ వార్నర్ 49, జోరూట్,రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ 48 సెంచరీలతో ఈ లిస్టులో ఉన్నారు. ఇక ఆ తర్వాత కెన్ విలియమ్స్ అని 47 ఎబి డివిలియర్స్ 45 సెంచరీలతో ఉన్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: