బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కి వరల్డ్ క్రికెట్లో ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరల్డ్ క్రికెట్లో అటు టీ20 ఫార్మాట్ కి ఈ రేంజ్ లో క్రేజ్ వచ్చిందంటే అందుకు ఐపీఎల్ కూడా ఒక కారణం అని చెప్పాలి. ఆ రేంజ్ లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపుని సంపాదించుకుంది ఈ టి20 టోర్నీ. ఒక సాదాసీదా టీ20 లీగ్ గా ప్రారంభమైన ఐపీఎల్ ఇక ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న అందరూ ఆటగాళ్లు కూడా ఐపీఎల్ లో భాగం కావాలని తెగ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు.


 ఎందుకంటే ఐపీఎల్ లో పాల్గొంటే ఒకవైపు కోట్ల రూపాయల ఆదాయం రావడంతో పాటు ఇంకోవైపు ఇక ఎంతోమంది స్టార్ ప్లేయర్ తో డ్రెస్సింగ్ రూమ్ పంచుకుని గొప్ప అనుభవాన్ని కూడా సంపాదించుకునే అవకాశం దొరుకుతుంది. అందుకే ఐపీఎల్ టోర్నీలో పాల్గొనడానికి అందరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులందరికీ కూడా ఆలరించింది. అప్పటికే రెండుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలుచుకున్న కోల్కతా నైట్ రైడర్స్ ఇక ఏడాది మూడోసారి టైటిల్ విజేతగా అనిపించింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు 2025 ఐపీఎల్ గురించి ఒక ఇంట్రెస్ట్ న్యూస్ వైరల్ గా మారిపోయింది.


 మరికొన్ని రోజుల్లో ఏకంగా ఐపీఎల్ లోని అన్ని జట్ల ఓనర్లతో బీసీసీఐ సమావేశం కాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెల 30 లేదా 31న అని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లతో బీసీసీఐ ముంబైలో సమావేశం కాబోతుందట. ఈ భేటీలో 2025 మెగా వేలం గురించి చర్చలు జరపనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఒక్కో జట్టుకు ఎన్ని రిటెన్షన్ లు ఉండాలని దానిపై ఫ్రాంచైజీ ల నుంచి బీసీసీఐ అభిప్రాయం తీసుకోవాలని అనుకుంటుందట. దీనిపై ఇప్పటికే అన్ని అన్ని జట్ల ఓనర్లకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. అయితే ఈ భేటీలో ఇక ఐపీఎల్ లో కీలక నిర్ణయాలు తీసుకోవడంపై చర్చించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl