ఇటీవల కాలంలో క్రికెట్ కి ఉన్న ఆదరణ ప్రపంచ దేశాల అంతకంతకు పెరిగిపోతోంది అనే విషయం తెలిసిందే. మొన్నటి వరకు క్రికెట్ అంటే తెలియని దేశాలు సైతం ఇక ఇప్పుడు ప్రత్యేకంగా ఒక క్రికెట్ జట్టును తయారు చేసుకుని అంతర్జాతీయ క్రికెట్లో రాణించేందుకు ఆసక్తిని కనబరిస్తూ ఉన్నాయి. అయితే అటు క్రికెట్ చూసి అభిమానుల సంఖ్య కూడా అంతకంతకు పెరిగిపోతూ ఉంది.

 ఇకపోతే ఉత్కంఠ భరితంగా సాగుతున్న క్రికెట్ మ్యాచ్లలో కొన్ని కొన్ని సార్లు ప్రేక్షకులను సైతం అబ్బురపరిచే ఆసక్తికర ఘటనలు చోటుచేసుకుంటూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది ప్లేయర్లు ఏకంగా తమ మెరుపు ఫీల్డింగ్ తో అభిమానులను కాదు సాదరణ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇలా జరిగింది నిజమేనా అని కళ్ళతో చూసిన కూడా నమ్మలేని విధంగా కొన్ని కొన్ని ఘటనలు క్రికెట్లో జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. మరి ముఖ్యంగా అటు ఫోర్ బార్డర్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న కొంతమంది ఆటగాళ్లు ఏకంగా అద్భుతమైన విన్యాసాలు చేస్తూ క్యాచ్లను అందిపుచ్చుకోవడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటిదే జరిగింది.


 ఒక అద్భుతమైన క్యాచ్ కు కి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. క్యాచ్ అంటే అలాంటి ఇలాంటి క్యాచ్ కాదు  మీరు ఒకవేళ క్రికెట్ లవర్స్ అయి ఉంటే ఇక ఇప్పటివరకు మీ జీవితంలో ఇలాంటి అరుదైన క్యాచ్ చూసి ఉండరు అని చెప్పాలి. ఆ రేంజ్ లో ఒక ప్లేయర్ క్యాష్ అందుకున్నాడు. ఎంతో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఒక ప్లేయర్ ఏకంగా అమాంతం సూపర్ మాన్ లాగా గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది. అయితే ఇది ఎప్పుడు ఎక్కడ జరిగిన మ్యాచ్ కి సంబంధించిన వీడియో అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: