సాధారణంగా నాగుపాములు పగబడతాయని.. వాటికి హాని చేసిన వ్యక్తులను గుర్తు పెట్టుకుని మరి కాటు వేస్తూ ఉంటాయి అని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అయితే నాగు పాముల పగ ఎంత ప్రమాదకరంగా ఉంటుంది అన్నది చూపించే విధంగాఇక ఇప్పటివరకు ఎన్నో సినిమాలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే. సినిమాలో పాములు పగబట్టి ఏకంగా హాని చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లి మరి కాటు వేస్తాయి అన్న విషయాన్ని చూపించడంతో నిజంగానే పాములు పగబడతాయి అన్న విషయాన్ని ప్రజలందరూ నమ్మేశారు.


 కానీ పాములకు పగబట్టేంత జ్ఞాపకశక్తి ఉండదని.. ఇక పాములు పగపడతాయి అన్నది కేవలం ఒక మూఢనమ్మకం మాత్రమే అంటూ ఇప్పటివరకు ఎంతోమంది నిపుణులు క్లారిటీ ఇచ్చిన నాగుపాములు పగబడతాయి అన్న ఆలోచన మాత్రం చాలా మంది జనాల మనసులోంచి పోలేదు. అయితే ఇక్కడ నిజంగానే పాములు పగబడతాయి అన్నదానికి నిదర్శనంగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా యూపీలోని ఫతేపూర్ కు చెందిన వికాస్ అనే వ్యక్తిని ఒక పాము ఏకంగా ఏడుసార్లు కాటు వేసింది. పాము కాటు నుంచి తప్పించుకునేందుకు వేరే ఊరికి వెళ్ళిన అక్కడ అతను పాముకాటుకు గురయ్యాడు.


 ఇందుకు సంబంధించిన ఘటన ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేసింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వికాస్ తనను ఏడు సార్లు పాము కాటు వేసింది అంటూ చెప్పిన విషయం నిజం కాదు అన్న విషయం బయటపడింది. అతను కేవలం ఒక్కసారి మాత్రమే పాము కాటుకు గురయ్యాడు అన్న విషయం ఇటీవల దర్యాప్తులో తేలింది. మొదటిసారి పాము కాటుకు గురైన తర్వాత అతను స్నేక్ ఫోబియాతో బాధపడ్డాడని.. ఆ తర్వాత పాము కాటు వేయకున్నప్పటికీ కాటు వేసినట్లు బ్రమపడ్డాడు అంటూ వైద్యులు తేల్చారు. అయితే అతనికి పరీక్షలు చేయకుండానే.. వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఇక ఈ విషయం బయటికి రాలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి: