ప్రస్తుతం ఇండియా, పాకిస్తాన్ దేశాలు మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ అన్ని దేశాలతో ఆడినట్లుగా ద్వైపాక్షిక సిరీస్ లను అటు పాకిస్తాన్ తో ఆడదు. అదే సమయంలో ఇక ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం కూడా అసలు జరగదు అని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య మ్యాచ్ చూడాలి అంటే ఆసియా కప్ లేదంటే ఐసీసీ నిర్వహించే ఈవెంట్ జరగాల్సిందే. ఈ క్రమంలోనే ఎప్పుడో ఒకసారి మాత్రమే జరిగే ఈ ఉత్కంఠ భరితమైన పోరును చూసేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిని కనబరుస్తూ ఉంటుంది.


 ఇక ఈ దాయదుల పోరుని వరల్డ్ క్రికెట్ ప్రేక్షకులు హై వోల్టేజ్ మ్యాచ్ అని కూడా పిలుచుకుంటూ ఉంటారు అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి క్రికెట్ సంబంధాల పై కొనసాగుతున్న నిషేధం దృశ్యం పాకిస్తాన్లో జరుగుతున్న పలు ఐసిసి ఈవెంట్లలో అటు భారత్ పాల్గొనడం లేదు. తాము ఆడబోయే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించాలి అంటూ డిమాండ్ చేస్తుంది. అయితే గతంలో ఆసియా కప్ సమయంలో కూడా భారత్ ఇలాగే మొండిపట్టు వీడకపోవడంతో.. ఐసీసీ దిగివచ్చి ఏకంగా భారత్ ఆడబోయే మ్యాచ్లను శ్రీలంక వేదికగా నిర్వహించింది అన్న విషయం తెలిసిందే. అయితే 2025 ఏడాదిలో ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరగబోతుంది.


 ఛాంపియన్స్ ట్రోఫీకి టీమ్ ఇండియా తన దేశానికి రావాలి అంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రిక్వెస్ట్ చేస్తుంది. కానీ అటు బీసీసీఐ మాత్రం మొండి పట్టు వీడటం లేదు. తమకోసం తటస్థ వేదికను ఏర్పాటు చేయాలని లేదంటే.. టోర్ని నుంచి తప్పుకుంటాము అంటూ తెగేసి చెప్పేస్తుంది. ఇలాంటి సమయంలో బీసీసీఐ తీరుపై అటు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు తమ దేశానికి రాకపోతే వాళ్లు లేకుండానే ఛాంపియన్ ట్రోఫీ నిర్వహిస్తాము అంటూ ఇటీవల పాకిస్తాన్ క్రికెటర్ హాసన్ అలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. వారు ఆడకపోతే క్రికెట్ ఏమి అంతం కాదు అంటూ ఘాటుగానే కామెంట్స్ చేశాడు. ఇప్పటికే ఇండియా లేకుండా మేము ఆడేందుకు సిద్ధమయ్యాము. మేము ఆడటానికి భారత్ వెళ్ళినప్పుడు.  వాళ్లు కూడా పాకిస్తాన్ కు రావాలి. చాలామంది ప్లేయర్లు పాకిస్తాన్లో ఆడాలని అనుకుంటున్నారు. కానీ వారి విధివిధానాలు ఒప్పుకోక సైలెంట్ గా ఉండిపోయారు అంటూ హసన్ అలీ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: