ఇండియా, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలపై నిషేధం కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ నిషేధం నేపథ్యంలో ఇరుదేశాలు ఒక దేశ పర్యటనకు మరో దేశం వెళ్లడం అస్సలు జరగదు. కేవలం ఆసియా కప్ లేదా వరల్డ్ కప్ లాంటి టోర్నీలో జరిగినప్పుడు మాత్రమే ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే  అయితే గత కొంతకాలం నుంచి ఐసీసీ నిర్వహిస్తున్న టోర్నీలు పాకిస్తాన్ వేదికగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో భారత జట్టు అటు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లడంపై ప్రపంచ క్రికెట్లో చర్చ జరుగుతూనే ఉంది. గతంలో ఆసియా కప్ టోర్నీకి పాకిస్తాన్ ఆతిధ్యం ఇస్తే తాము పాకిస్తాన్ కు వెళ్లే ప్రసక్తే లేదు అంటూ అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి స్పష్టం చేసింది.


 తటస్థ వేదికపై మ్యాచులు నిర్వహిస్తేనే భారత జట్టు ఆసియా కప్ టోర్నీలో పాల్గొంటుంది అంటూ స్పష్టం చేయడంతో ఇక ఆసియా క్రికెట్ కౌన్సిల్ సుదీర్ఘ చర్చల తర్వాత భారత డిమాండ్కు ఒప్పుకుంది. ఈ క్రమంలోనే టీమిండియా ఆడే మ్యాచ్లను తటస్థ వేదికపై నిర్వహించారు. అయితే వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే టీమిండియా అటు పాకిస్తాన్ పర్యటనకు రావాలి అంటూ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కోరుతుంది. కానీ ఇందుకు బీసీసీఐ అంగీకరించడం లేదు. వన్డే వరల్డ్ కప్ ఆడేందుకు తాము భారత్ వచ్చినప్పుడు భారత జట్టు ఎందుకు పాకిస్తాన్ రాదు అంటూ ఆ దేశ ఆటగాళ్లు కూడా ప్రశ్నిస్తున్నారు.


 ఇదే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉండగా.. ఇక ఇటీవల ఈ విషయంపై భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ స్పందించాడు. పాకిస్తాన్ లో వచ్చే ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా వెళ్లకపోవడం సరైన నిర్ణయం అంటూ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. అక్కడ పరిస్థితి లేదు కూడా బాగాలేవు అంటూ చెప్పుకొచ్చాడు. భారత జట్టు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లాలి. ఆ దేశంలో భద్రతపై అక్కడ ప్రతిరోజు ఏదో ఒక ఘటన జరుగుతూనే ఉంటుంది. బిసిసిఐ తీసుకున్న నిర్ణయం సరైనది. ఆటగాళ్ల భద్రత కంటే ఏది ముఖ్యం కాదు అంటూ హర్భజన్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: