బిసిసిఐ ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నీకి ఎంత క్రేజీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక సాదాసీదా  టి20 టోర్నీగా ప్రారంభమైన ఐపిఎల్.. ఇక ఇప్పుడు వరల్డ్ లోనే రిచెస్ట్ క్రికెట్ లీక్ గా కొనసాగుతూ ఉంది. అందుకే ఇక ఈ టోర్నీలో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి క్రికెటర్లు తరలివస్తూ ఉంటారు. ఐపీఎల్ కోసం అంతర్జాతీయ మ్యాచ్లను కూడా వదులుకోవడానికి సిద్ధమవుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే.


 కాగా ఇప్పటికీ 2024 ఐపిఎల్ సీజన్ ముగిసింది. అయితే వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్లో భారీగా మార్పులు జరగబోతున్నాయ్. ఎందుకంటే 2025 ఐపీఎల్ సీజన్ కి ముందు మెగా వేలం జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే అన్ని ఫ్రాంచైజీల యాజమాన్యాలు జట్టులో ఎన్నో మార్పులు చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయ్. కొన్ని ఫ్రాంచైజీలు  ఏకంగా కెప్టెన్లను వదులుకోవడానికి సిద్ధమవుతుంటే.. ఇంకొన్ని జట్ల యాజమాన్యాలు అటు కోచింగ్ సిబ్బందిలో మార్పు చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. మెగా వేలం కోసం ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నాయ్ అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే అటు పంజాబ్ కింగ్స్ జట్టు కూడా ఇక ఆ జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న బేలిస్ ను వదులుకునేందుకు సిద్ధమవుతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఏడాదితోనే అటు బేలిస్ హెడ్ కోచ్ కాంట్రాక్ట్ కాలం కూడా ముగుస్తుంది. దీంతో కొత్త కోచ్ ను నియమించుకోవాలని ఆలోచనలో అటు పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కొత్త కోచ్గా భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ను నియమించాలని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం భావిస్తుందట. కాగా2019 - 21 కాలంలో పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్గా అటు వసీం జాఫర్ పనిచేశాడు అన్న విషయం తెలిసిందే. కాగా మొన్నటికి మొన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా హెడ్ కోచ్ పదవి నుంచి రికీ పాంటింగ్ తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: