మొన్నటికి మొన్న టీమిండియా పురుషుల జట్టు అటు వరల్డ్ కప్ లో ఎంత అద్భుతమైన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ 2024 ఎడిషన్ లో మొదటి మ్యాచ్ నుంచే జైత్రయాత్రను మొదలుపెట్టిన టీమిండియా.. ఇక ఫైనల్ మ్యాచ్ వరకు ఒక్క ఓటమి లేకుండా అదరగొట్టేసింది. ఫైనల్ లో కూడా సౌత్ ఆఫ్రికా ను ఓడించి టైటిల్ విజేతగా కూడా నిలిచింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పొట్టి ఫార్మాట్లో 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ  ఇక రెండోసారి వరల్డ్ కప్ టైటిల్ అందుకోగలిగింది. ఇక రోహిత్ శర్మ అటు టీమిండియాకు వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు అన్న విషయం తెలిసిందే.


 ఇలా మొన్నటి వరకు వరల్డ్ కప్ టోర్నీలో అదరగొట్టిన టీమిండియా.. ఇక ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది. కాగా కేవలం పురుషుల జట్టు మాత్రమే కాదు మహిళల జట్టు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది అని చెప్పాలి. ఇక ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ లో ఇక ప్రత్యర్థులను వనికిస్తూ వరుస విజయాలు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆసియా కప్ లో భాగంగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో కూడా అదరగొట్టేసింది. ఏకంగా ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి.


 సెమీఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ జట్టును ఓడించిన మహిళల టీమ్ ఇండియా జట్టు అదరగొట్టేసింది. ఈ క్రమంలోనే భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఆసియా కప్ లో వరుసగా తొమ్మిదవ సారి టీమిండియా ఫైనల్స్ కు అర్హత సాధించింది అని చెప్పాలి. దీంతో ఈ టోర్నీ హిస్టరీలో ప్రతిసారి ఫైనల్స్ కు చేరిన జట్టుగా ఇక భారత రికార్డు క్రియేట్ చేసింది  ఇప్పటివరకు ఎనిమిది సార్లు ఫైనల్ ఆడిన టీమ్ ఇండియా.. 7 సార్లు టైటిల్ విజేతగా నిలిచింది. ఒకసారి రన్నరఫ్ ట్రోఫీతో సరిపెట్టుకుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు తొమ్మిదో సారి ఆసియా కప్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే 8వ టైటిల్ ను ముద్దాడేందుకు పట్టుదలతో ఉంది టీమిండియా. కాగా ఈనెల 28వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: