ఇండియన్ క్రికెట్లో టి20 ఫార్మాట్లో కొత్త శకం మొదలైంది. ప్రస్తుతం వన్డే టెస్ట్ ఫార్మాట్లకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. మొన్నటి వరకు మూడు ఫార్మాట్లకు కూడా సారథిగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక అతని సారధ్యంలో టీమిండియా ఎన్నో అద్భుతమైన విజయాలను సాధించింది. కాగా ఇటీవల రోహిత్ శర్మ టీమిండియా కు వరల్డ్ కప్ అందించాడు. వెస్టిండీస్ యూఎస్ వేదికగా జరిగిన 2024 t20 వరల్డ్ కప్ లో భారత జట్టును కెప్టెన్ గా ముందుకు నడిపించి టైటిల్ గెలిపించి పెట్టాడు.


 ఈ శుభ సందర్భంలోనే తన అంతర్జాతీయ టి20 కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. యువకులకు చాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే రోహిత్ కెప్టెన్సీ కి రిటైర్మెంట్ ప్రకటించగా.  మరోవైపు ప్రధాన కోచ్ రాహుల్ పదవీకాలం కూడాముగిసింది. దీంతో టి20 ఫార్మాట్లో  కొత్త కెప్టెన్ గా  సూర్యకుమార్.. కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ ఎంపికయ్యారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేటి నుంచి శ్రీలంకతో టి20 సిరీస్ ప్రారంభం కాబోతుండగా.. రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ బాధ్యతలు చేపట్టి జట్టును ముందుకు నడిపించబోతున్నాడు. ఈ క్రమంలోనే ఇక మ్యాచ్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో తనకు కెప్టెన్సీ రావడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సూర్యకుమార్.


 రోహిత్ శర్మను చూసి గ్రౌండ్లో లీడర్ ఎలా ఉండాలో నేర్చుకున్నాను అంటూ టీమిండియా కొత్త t20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తెలిపారు. కెప్టెన్సీ మార్పుపై  మాట్లాడుతూ.. రైలు ఇంజన్ మాత్రమే మారింది బోగీలు మారలేదు అంటూ సరదాగా కామెంట్ చేశాడు. ఇలాగే ముందుకు సాగుతాం అంటూ తెలిపాడు. హార్దిక్ పాండ్యా జట్టుకు ఎంతో అవసరం. అందుకే అతని పాత్రలో ఎలాంటి మార్పు ఉండదు అని చెప్పుకొచ్చాడు. రోహిత్, విరాట్, జడేజాలను భర్తీ చేయడం కష్టం. కానీ యువ ఆటగాళ్లు బాగా సిద్ధమయ్యారు అంటూ సూర్య కుమార్ యాదవ్ ఇటీవల నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పకు వచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: