ప్రస్తుతం టీమిండియా జట్టు శ్రీలంక పర్యటనలో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే లంక గడ్డపై అడుగు పెట్టిన టీమిండియా అక్కడ మూడు ఫార్మాట్ లలో కూడా సిరీస్ లు ఆడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే మొన్నటి వరకు వరల్డ్ కప్ మ్యాచ్ లతో బిజీ బిజీగా ఉన్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా లాంటి ప్లేయర్లకు ఇక విశ్రాంతి ప్రకటించిన నేపథ్యంలో.. ఇలాంటి సీనియర్లు లేకుండానే ప్రస్తుతం టీమిండియా బరులోకి దిగిపోతుంది. అదే సమయంలో ఇక కొత్త కెప్టెన్గా ఎంపికైన సూర్య కుమార్ యాదవ్ టి20 ఫార్మాట్లో జట్టును ముందుకు నడిపించబోతున్నాడు.


 టీమ్ ఇండియాకు కొత్త హెడ్ కోచ్గా ఎంపికైన గౌతమ్ గంభీర్ నేతృత్వంలో మొదటిసారి టీమిండియా ఇక విదేశీ పర్యటనకు వెళ్లి సిరీస్ లో ఆడుతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే  ఈ పర్యటనలో టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా శ్రీలంకతో తలబడేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుంది భారత జట్టు. అయితే ఇక నేటి నుంచి శ్రీలంక, భారత్ మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కాబోతుండగా.. మొదటి మ్యాచ్ కి ముందే అటు లంక జట్టుకి బిగ్ షాక్ తగిలింది. జట్టులోని కీలక ప్లేయర్లు దూరమయ్యాడు అనేది తెలుస్తోంది.



 శ్రీలంక జట్టులో స్టార్ ఫేసర్ గా కొనసాగుతున్న బిసురా ఫెర్నాడో చాతి ఇన్ఫెక్షన్ బారిన పడ్డట్లు శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. దీంతో ఇక నేడు జరగబోయే తొలి మ్యాచ్ కు ఫెర్నాడో దూరం కాబోతున్నట్లు పేర్కొంది. అతని స్థానంలో ఆల్ రౌండర్ రమేష్ మోండిస్ ను స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఫెర్నాడో లాంటి కీలక ప్లేయర్ దూరం కావడం మాత్రం అటు శ్రీలంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పాలి. కాగా అటు భారత్తో టీ20 సిరీస్ ప్రారంభం కాకడానికి ముందు సువాన్ తుషార, దుష్మంత చమీరా లాంటి కీలక ప్లేయర్లు కూడా గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: