రీసెంట్ టైమ్స్‌లో టీమ్ ఇండియాలో చాలా మార్పులు జరిగాయి. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు కోచ్ అయ్యాడు. అతని మొదటి మ్యాచ్ లోనే సూర్యకుమార్ యాదవ్ టీ20 కెప్టెన్ గా ఆడుతున్నాడు. ఈ రెండు మార్పులతో క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ టీమిండియా కోచ్ అయిన రాహుల్ ద్రవిడ్ గంభీర్ కి ఒక వీడియో మెసేజ్ పంపాడు. "ఒత్తిడిలోనూ నవ్వు గంభీర్" అంటూ ఒక స్వీట్ అడ్వైస్ ఇచ్చాడు.

క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ తన వీడియో మెసేజ్ లో కొత్త కోచ్ అయిన గౌతమ్ గంభీర్ కి చాలా మంచి సలహాలు ఇచ్చాడు. ఏం జరిగినా ఓపికగా ఉండాలని, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండాలని చెప్పాడు. వీళ్లిద్దరూ కలిసి చాలా కాలం క్రికెట్ ఆడారు. మంచి స్నేహితులు కూడా అయ్యారు. ఒకరి సలహాలు మరొకరు పాటిస్తుంటారు.

గంభీర్‌లో గెలవాలనే కోరిక, యువ ఆటగాళ్లకు మద్దతు ఇవ్వాలనే ఆశ ఎక్కువ అని రాహుల్ చెప్పుకొచ్చాడు. జట్టులోని ప్లేయర్స్ నుంచి బెస్ట్ పర్ఫామెన్స్ తీసుకురాగల సత్తా గంభీర్ కు ఉందని ద్రవిడ్ అన్నాడు. గంభీర్ కోచ్‌గా ఉన్నప్పుడు కూడా ఇవే లక్షణాలతో టీఎం విజయానికి బాటలు వేస్తాడని అతను విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.

భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉండడం ఎంత కష్టమో ద్రవిడ్ చెప్పారు. ప్రజల అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి, ప్రతి చిన్న తప్పుకు కూడా విమర్శలు వస్తాయి అని అన్నాడు. గంభీర్‌కి ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్, ముందు జట్టు నాయకులు, మేనేజ్‌మెంట్ అందరూ సహకరిస్తారని హామీ ఇచ్చాడు. అభిమానుల కోసం ఆడాలి అని అన్నాడు. అభిమానులు చాలా క్వశ్చన్ చేస్తారు అయినా జట్టుని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారని చెప్పారు. నవ్వాలంటూ ద్రవిడ్ ఇచ్చిన సలహాని వింటూనే గంభీర్ నవ్వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: