రోహిత్ శర్మ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఇండియా జట్టుకు t20 కెప్టెన్‌ అయ్యాడు. అయితే ఈ ప్లేయర్ ఎంతో కాలం ఈ పదవిలో ఉండబోడు అంటూ మాజీ న్యూజిలాండ్ క్రికెటర్‌ స్కాట్ స్ట్రైస్ సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఇండియా జట్టుకు షార్ట్ టర్మ్ t20 కెప్టెన్‌గా మాత్రమే ఉంటాడని అన్నాడు. ఆయన అభిప్రాయం ప్రకారం సూర్యకుమార్ యాదవ్ తాత్కాలిక కెప్టెన్‌గా మాత్రమే ఉంటాడు. యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా పనిచేస్తూ నాయకత్వ నైపుణ్యాలను తెలుసుకుంటాడు.

T20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత, ఇండియా జట్టుకు కొత్త మార్పులు చేశారు. సూర్యకుమార్ యాదవ్‌ని కెప్టెన్‌గా నియమించారు. శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్‌గా ఉంచారు. ఈ నిర్ణయం శ్రీలంక పర్యటన నుంచి అమలులోకి వచ్చింది. ఇది గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న ముఖ్య నిర్ణయాలలో ఒకటి.

స్కాట్ స్ట్రైస్ టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న రెండు నిర్ణయాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గిల్‌ని వైస్ కెప్టెన్‌గా నియమించడంలో తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, ఆడుతూ ఆడుతూనే అతడు కెప్టెన్‌ పనిని నేర్చుకుంటాడని ఆయన అన్నారు. "ఈ నిర్ణయాలను బట్టి చూస్తుంటే గౌతమ్ గంభీర్ t20 జట్టులో ప్రస్తుతం నేచురల్ లీడర్ లేడని భావిస్తున్నాడు, సూర్యకుమార్‌ను కొంతకాలం కెప్టెన్‌గా ఉపయోగించాలి అని మాత్రమే చూస్తున్నాడు." అని స్ట్రైస్ అభిప్రాయపడ్డారు.

"చూడండి, వైస్ కెప్టెన్ అంటే కేవలం నాయకత్వం గురించి, క్రికెట్ జట్టును ఎలా నడపాలి అనేది నేర్చుకునే వ్యక్తి. శుభ్మన్ గిల్‌ని వైస్ కెప్టెన్‌గా ఉంచడంలో నాకు ఎలాంటి సమస్య లేదు. అతను IPLలో కెప్టెన్‌గా ఉన్నాడు. అతను చాలా పెద్ద స్టార్లతో కూడిన జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు, కాబట్టి అందులో ఎలాంటి సమస్య లేదు." అని చెప్పుకొచ్చాడు.

ప్రస్తుత ఆటగాళ్లలో గౌతమ్ గంభీర్ సహజ నాయకుడిని చూడలేదని, అందుకే సూర్యకుమార్ యాదవ్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా ఎంచుకున్నారని స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. ఈ సమయంలో శుభమాన్ గిల్‌ భవిష్యత్తులో కెప్టెన్‌గా తన ఆటను మెరుగుపరచుకోగలడు. లాంగ్ టర్మ్ కెప్టెన్ కూడా అవ్వగలడు.

మరింత సమాచారం తెలుసుకోండి: