టీమిండియాలో కొత్త ప్రతిభకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు ఎంతో మంది ఆటగాళ్లు ఇక తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకుంటూ భారత సెలక్టర్ ల చూపును ఆకర్షిస్తున్నారు. ఇంకా ఎంతో మంది యువ ఆటగాళ్ళు క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకుంటూ అటువైపుకు అడుగులు వేస్తున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక దేశవాళి క్రికెట్ సహా ఐపీఎల్ లాంటి టోర్నీలలో ఎవరైనా యువ ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు అంటే చాలు సెలెక్టర్లు తక్కువ సమయంలోనే వారికి భారత జట్టులో చోటు కల్పించడం చేస్తున్నారు. ఇలా టీమ్ ఇండియాలోకి వచ్చిన ఆటగాళ్లు ఇక్కడ నిరూపించుకొని తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నారు.


 ఇలా ఈ మధ్యకాలంలో ఎంతోమంది యువ ఆటగాలు టీమ్ ఇండియాలోకి అరంగేట్రం చేస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా కాస్త మంచి ప్రదర్శన చేస్తే చాలు ఎంతో మంది  టీమిండియాలో ఛాన్స్ లో దక్కించుకుంటే.. ఒక క్రికెటర్ కు మాత్రం ఎంత అత్యుత్తమ ప్రదర్శన చేసిన కూడా భారత జట్టులో చోటు దక్కటం లేదు. ఒకవేళ భారత జట్టులోకి ఎంపిక చేసినప్పటికీ చివరికి తుది జట్టులో మాత్రం అతన్ని తీసుకోవడం లేదు సెలెక్టర్లు. అతను ఎవరో కాదు ఇండియన్ క్రికెట్ లోనే లక్కీ క్రికెటర్గా పిలుచుకునే సంజు శాంసన్. అతను వికెట్ కీపర్ కం బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్నారు. ఇక ఈ మధ్యకాలంలో మంచి ఫామ్ లో కొనసాగుతూ సూపర్ పర్ఫార్మెన్స్ కూడా చేస్తున్నాడు.


 అయినప్పటికీ అతన్ని దురదృష్టం వెంటాడుతూనే ఉంది. ఇక ఇటీవల  మరోసారి అతని బ్యాడ్ లక్ ఎంత దారుణంగా ఉంది అన్న విషయం నిరూపితమైంది. ప్రస్తుతం టీమిండియా శ్రీలంక పర్యటనలో ఉండగా సూర్య కుమార్ కెప్టెన్సీ లో ప్రస్తుతం టి20 సిరీస్ లో బరిలోకి దిగింది టీం ఇండియా. అయితే తొలి 20 మ్యాచ్ లో సంజు కు తుది జట్టులో చోటు దక్కలేదు. కనీసం టాప్ ఆర్డర్ బ్యాటర్ గాను పరిగణలోకి తీసుకోలేదు. పరాగ్ కు అవకాశం ఇచ్చి సంజూను దూరం పెట్టేశారు. ఈ విషయం తెలిసి సంజూ వరల్డ్ లోనే మోస్ట్ అన్ లక్కీ క్రికెటర్ అని కొంతమంది అంటూ ఉంటే.. అతన్ని రెండో టీ20 మ్యాచ్ లో అయినా జట్టులోకి తీసుకోవాలని మరి కొంత మంది కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: