సూర్యకుమార్ యాదవ్ టీమిండియా t20 కెప్టెన్‌గా ఎన్నికైన సంగతి తెలిసిందే. అతడు కెప్టెన్‌గా తన కెరీర్‌ను విజయవంతంగా ప్రారంభించాడు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ గురించి మాట్లాడుతూ, శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు మొదట్లో బాగా ఆడినప్పటికీ, మ్యాచ్ తమ చేతుల్లోనే ఉందని అనుకున్నట్లు చెప్పాడు. ఎందుకంటే, మైదానంలో తేమ తక్కువగా ఉండటం వల్ల బౌలర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని భావించాడు.

భారత్ 214 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శ్రీలంక 149 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి మ్యాచ్‌ను గెలిచేలా కనిపించింది. కానీ అనంతరం, శ్రీలంక 8 వికెట్లు కోల్పోయి 21 పరుగులు మాత్రమే చేసింది. దీంతో భారత్ 43 పరుగుల తేడాతో మొదటి t20 మ్యాచ్‌ను గెలుచుకుంది.

సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ గెలిచిన తర్వాత మాట్లాడుతూ "మైదానంలో తేమ లేకపోవడం మా అదృష్టం. మేం వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో ఆడిన తీరును చూస్తే, ఈ మ్యాచ్ ఇంకా చాలా కష్టంగా ఉంటుందని అనిపించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లు చాలా బాగా ఆడారు. కానీ ఈ మైదానం కొద్ది కొద్దిగా నెమ్మదిగా మారుతుందని నాకు తెలుసు. శ్రీలంక బ్యాట్స్‌మెన్లు మొదటి బంతి నుంచి అద్భుతంగా ఆడారు. వారు ఆటను చాలా వేగంగా ముందుకు తీసుకువెళ్లారు. వారికి అభినందనలు. ఈ మైదానం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో మాకు తెలుసు." అని చెప్పుకొచ్చాడు. కేవలం అదృష్టం వల్లే ఈ మ్యాచ్ గెలిచినట్లు అది చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

శ్రీలంక జట్టు కెప్టెన్‌ చరిత్ అసలంక మాట్లాడుతూ.. "మొదటి ఆరు ఓవర్లలో మా బౌలర్లు బాగా ఆడలేదు. కానీ ఆ తర్వాత మేం స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాం. భారత్ 240 పరుగులు చేస్తుందని భావించాము కానీ, మేం వారిని 213 పరుగులకు పరిమితం చేయగలిగాం." అని అన్నాడు. శ్రీలంక జట్టు కెప్టెన్ ఇంకా మాట్లాడుతూ "మా జట్టు 149 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయి బాగా ఆడుతున్నప్పటికీ, 170 పరుగులకు ఆలౌటయ్యింది. మా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లు బాగా ఆడలేకపోయారు." అని అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: